Begin typing your search above and press return to search.

బెంగాల్ ను కుదిపేస్తున్న ‘ఖేలా హోబ్’?

By:  Tupaki Desk   |   27 Feb 2021 9:30 AM GMT
బెంగాల్ ను కుదిపేస్తున్న ‘ఖేలా హోబ్’?
X
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ‘ఖేలా హోబ్’ అనే మాట ఎక్కువగా వినపడుతోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పదే పదే ‘ఖేలా హోబ్’ అంటూ సవాల్ విసురుతున్నారు. పొలిటికల్ ర్యాలీల్లో కూడా ఇదే స్లోగన్ తో డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు.

ఇంతకీ ఈ ఖేలాహోబ్ అంటే ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బెంగాల్ సీఎం మమతా ఎన్నికల ప్రచారంలో ‘ఖేలా హోబ్’ అంటూ నినదించారు. అప్పటి నుంచి టీఎంసీ, బీజేపీ నేతలు ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘ఖేలా హోబ్’ అంటే ఆట మొదలైంది అని బెంగాలీ అర్థం.

కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్ కు చెందిన బంగ్లాదేశి ఆవామీ లీగ్ ఎంపీ షమీమ్ ఒస్మాన్ తొలిసారిగా ఈ ‘ఖేలా హోబ్ ’ నినాదాన్ని అక్కడ వినిపించారు. సీఎం మమతా కూడా దీన్ని అందుకొని బీజేపీకి సవాల్ చేశారు. ఇప్పుడు బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు ఇదే స్లోగన్ తో బెంగాల్ లో హోరెత్తిస్తున్నారు.

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం తాజాగా ‘ఖేలాహోబ్’ అంటూ మమతకు సవాల్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి కోసం నిజంగానే ఆట మొదలైంది’ అని కామెంట్ చేశారు.

ఇక బీజేపీ నేతలను ఔట్ సైడర్స్ అంటూ మమత, టీఎంసీ ఇరుకునపెడుతోంది. తాము లోకల్ అని.. ఇక్కడే ఉంటామంటూ ఎన్నికల వేడి రగిలిస్తున్నారు.