Begin typing your search above and press return to search.
డోనాల్డ్ ట్రంప్ ను చంపుతాం.. ఆ దేశం తీవ్ర హెచ్చరిక!
By: Tupaki Desk | 25 Feb 2023 6:26 PM GMTఅమెరికా, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య ఏవైనా ఆటల పోటీలు జరిగినప్పుడు కూడా హైటెన్షన్ తప్పదు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరాన్ పై యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇరాన్ టాప్ కమాండర్ ను సులేమానీని అమెరికా దళాలు ఆ సందర్భంగా అంతమొందించాయి. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూనే ఉంది.
మరోవైపు అమెరికా ఒత్తిడితో దాని మిత్ర దేశాలైన పశ్చిమ దేశాలు ఇరాన్ పై తీవ్ర ఆంక్షలు విధించాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పైన అమెరికా ఒత్తిడి తెచ్చింది. అయినా సరే ఆంక్షలను తట్టుకుని ఇరాన్ తమ అణ్వాయుధ పాటవాన్ని పెంపొందించుకుంటోంది. ఓవైపు అమెరికాతో ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు పశ్చిమాసియాలో తమ శత్రు దేశాలను ఎదుర్కోవాల్సి రావడం వంటి కారణాలతో పెద్ద ఎత్తున అణ్వాయుధాలపై ఇరాన్ దృష్టి పెట్టింది.
తాజాగా ఇరాన్ కమాండర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అంతమొందిస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇరాన్ ఓ క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఒకరు మాట్లాడుతూ.. తమ టాప్ కమాండర్‌ను చంపినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అంతమొందిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు.
కాగా 1,650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్ క్షిపణిని తాము అభివృద్ధి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ అధినేత అమిరాలి హజీజాదే తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్ అధికారిక టీవీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీ మరణించారని గుర్తు చేశారు. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై ఇరాన్ బలగాలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయన్నారు. అయితే అమాయక సైనికులను చంపాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. తమ లక్ష్యం డోనాల్డ్ ట్రంప్ అని తెలిపారు. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నామని అమిరాలి హజీజాదే చెప్పారు. అలాగే ఇరాన్ టాప్ కమాండర్ అయిన సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోతోపాటు ఆ దేశ మిలిటరీ కమాండర్లను కూడా చంపుతామని స్పష్టం చేశారు.
ఇరాన్ టాప్ కమాండర్ అయిన సులేమానీ మరణం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అమెరికాపై ప్రతీకారం కోసం ఉవ్విళ్లూరుతున్న ఇరాన్.. రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యాకు ఇరాన్ డ్రోన్లను కూడా అందించడం గమనార్హం. ఇప్పుడు తాజాగా ఇరాన్ క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేయడంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.