Begin typing your search above and press return to search.

కంపుపై ఇంపైన స‌ర్వే ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:30 PM GMT
కంపుపై ఇంపైన స‌ర్వే ఇదేన‌ట‌
X
ఆ విష‌యం.. ఈ విష‌యం అన్న తేడా లేకుండా ప్ర‌తిదాని మీద స‌ర్వే చేస్తున్న వైనం క‌నిపిస్తుంది. ప్ర‌తి విష‌యాన్ని తెలుసుకోవ‌టంతో పాటు..కొత్త కొత్త ముచ్చ‌ట్ల‌ను బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న త‌ప‌నే దీనికి కార‌ణం. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలామంది చాలానే స‌ర్వేలు చేసినా..ఎవ‌రికి రాని విచిత్ర‌మైన ఐడియా ఒక‌టి టాప్ టెన్స్ వెబ్ సైట్‌ కు వ‌చ్చింది.

ఈ సైట్ చేసిందేమంటే.. ప్ర‌పంచంలో అత్యంత దారుణ‌మైన వాస‌న ఉన్న‌దేమిట‌న్న విష‌యం మీద స‌ర్వే నిర్వ‌హించింది. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు పాల్గొన్నారు. ఈ స‌ర్వేలో కంపున‌కు సంబంధించి చాలానే అంశాలు ఉన్నాయి. వాటి మీద స‌ర్వేలో త‌మ అభిప్రాయాలు చెప్పినోళ్లు ఉన్నారు. మ‌రింత‌గా చేసిన స‌ర్వేలో బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాలు ఏమిటన్న‌ది చూస్తే.. కాస్త వికారంగా అనిపించినా రిజ‌ల్ట్ చెప్పాల్సిందే.

అత్యంత దుర్గంధ పూరిత వ‌స్తువుల జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్ కుక్క షిట్ గా తేల్చారు. ఈ విష‌యాన్ని స‌ర్వేలో పాల్గొన్న 43 శాతం మంది ఏక‌గ్రీవంగా ఇదే ఛండాల‌మైన కంపు కొడుతుంద‌ని తేల్చారు.

త‌ర్వాతి స్థానంలో వాంతి చేసుకున్న‌ప్పుడు వ‌చ్చే వాస‌న‌గా చెప్పారు. ఈ రెండు వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా.. త‌ర్వాత చెప్పిన ఒక విష‌యం మాత్రం కాస్తంత కొత్త‌గా అనిపించ‌క మాన‌దు. అదేమంటే.. వెల్లుల్లి (చిన్న ఉల్లి) తిని బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి నుంచి వ‌చ్చే వాస‌న‌ను అస్స‌లు భ‌రించ‌లేమ‌ని తేల్చారు. ఇక‌.. భ‌రించ‌లేని కంపు జాబితాలో కుళ్లిన గుడ్లు.. పిల్లి షిట్‌.. డ‌ర్టీ డైప‌ర్ లాంటివి చాలానే ఉన్నాయి. ఇక‌.. చాలు.. భ‌రించ‌లేమంటారా?