Begin typing your search above and press return to search.

టీవీలో వెదర్‌ రిపోర్ట్‌ .. మధ్యలో ఆ వీడియోలు ప్రసారం !

By:  Tupaki Desk   |   21 Oct 2021 11:30 PM GMT
టీవీలో వెదర్‌ రిపోర్ట్‌ .. మధ్యలో ఆ వీడియోలు ప్రసారం !
X
టీవీలో ఓ యాంకర్ బిజీ బిజీగా వార్తలు చదువు వాతావరణం గురించి చెప్తుంది. ఇంతలో బ్యాక్ గ్రౌండ్ లో మరో ఆసక్తికర సినిమా మొదలైంది. పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. సదరు టీవీ ఛానెల్ టెక్నికల్ టీమ్ చూసుకోలేదా లేక కావాలనే అలా వదిలేశారో తెలియదు కానీ మొత్తానికి 15 సెకన్ల పాటు ఆ పోర్న్ వీడియో టీవీలో ప్రసారమైంది. వాస్తవానికి లైవ్ లో వెళ్లే వీడియోకి, టెక్నికల్ గా ఛానెల్ లో ఎయిర్ అయ్యే వీడియోకి 3 సెకన్ల తేడా ఉంటుంది. నీలి చిత్రం కనపడగానే దాన్ని ఆపేసి ఉంటే.. మహా అయితే ఓ ఐదు సెకన్లపాటు అవి అందరికీ కనపడేవి. కానీ ఏం జరిగిందో ఏమో 15 సెకన్లపాటు ఆ నీలిచిత్రం ప్రేక్షకులకు కనపడింది.

దీనిపై ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈవినింగ్‌ న్యూస్‌కాస్ట్‌లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ ను ప్రసారం చేయడం హాట్‌ టాపిక్‌ గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌ లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్‌ డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్‌క్లిప్‌ టెలికాస్ట్‌ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్‌ అవుతోంటే, యాంకర్‌, కో యాంకర్‌, కోడి ప్రోక్టర్‌ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌ గ్రౌండ్‌ లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది.

అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్‌ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్‌ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది.