Begin typing your search above and press return to search.
గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం ... ఎందుకంటే ?
By: Tupaki Desk | 12 Feb 2021 5:54 AM GMTఏపీలో పంచాయతీ పోరు ఆసక్తిగా సాగుతుంది. ఇప్పటికే తోలి విడత పోలింగ్ కూడా ముగియడంతో రెండో విడత పోలింగ్ పై మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే , ఈ ఎన్నికల్లో అన్నయ్యల మీద తమ్ముళ్లు పోటీ చేయడాలు, భార్య మీద భర్త పోటీచేయడం వాటి సంగతి అటుంచితే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ గుర్తులు గుర్తుండిపోయేలా వాటితోనే ప్రచారం చేస్తున్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచిన ఒక వ్యక్తి గౌను వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం పంచాయతీలు ఏడవ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో గౌను వేసుకుని మరీ తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అసలు ఇంతకీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ అభ్యర్థి గౌను వేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ..శ్రీనివాసరావు ఎన్నికల గుర్తు 'గౌను', దీంతో ఓటర్లందరికీ తన గుర్తు గుర్తుండిపోయేలా శ్రీనివాస రావు, తన అనుచరులతో కలిసి గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జనాలకు నవ్వు వస్తున్నా..ఈ గౌన్ బ్యాచ్ డోంట్ కేర్ అంటూ ప్రచారంలో బిజీ అయ్యారు. తమ గుర్తు అందరికీ గుర్తుండిపోయేలా ప్రచారం చేసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల గుర్తును జెండాగానో..బ్యానర్‌గానో పట్టుకొని ప్రచారం చేసుకోవాలి. కానీ ఈ అభ్యర్థి మాత్రం కొంచెం విచిత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు.