Begin typing your search above and press return to search.
ఎంతటి బిలియనీర్ అయినా... ఆడవాళ్ల విషయం లో వీకేనా?
By: Tupaki Desk | 12 July 2023 5:00 AM GMTఎంతవారు గాని వేదాంతులైన గాని..
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్...
కైపులో కైపులో కైపులో...
చిన్నది మేని లో మెరుపున్నది.. చెంప లో తలుక్కున్నది.. సైపలేకున్నది...
అని సినారే ఎప్పుడో చెప్పారు. అయితే ఆ విషయం లో వారూ వీరూ అనే తారమతమ్యాలు ఏమీ లేవని చెబుతుంటారు. అయితే ఇందుకు అత్యంత సంపన్నులు సైతం అతీతం కాదని తాజాగా లెక్కలు వెలుగు లోకి వస్తున్నాయని అంటున్నారు.
అవును... మోసాల కు పాల్పడాలనుకునేవారు ఎదుటివారి మానసిక బలహీనతల ను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారని అంటుంటారు. ఇందులో భాగంగా... తాజాగా ఎఫ్.టీ.ఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ కంపెనీ దివాలా వెనకా అలాంటి కారణాలు ఉన్నాయని అంటున్నారు!
టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ వంటి ప్రముఖుల కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించగలిగిన సామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్... తన బహామాస్ ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ లో మిలియన్ల సొమ్ము పెట్టుబడిపెట్టించ గలిగాడు! ఈ క్రమంలో బిలియనీర్ గా ఎదిగిన బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది.
దీంతో... మితిమీరిన నమ్మకమే మోసాల కు ప్రధాన కారకం అని పరిశోధన లో కనుగొన్నట్లు పరిశీలకులు చెబుతున్నారని తెలుస్తుంది. ఒక రంగం లో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం.. మరో రంగం లో వీక్ గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారని చెబుతున్నారు. ఫలితంగా.. అత్యంత సులువు గా బుట్ట లో పడిపోతారని.. ఫలితంగా జీవితం తారుమారు అయిపోద్దని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే.. ఆర్థికంగా దిగువస్థాయి లో ఉన్నవారి కంటే ధనవంతుల ను లేదా సంస్థల ను మోసం చేయడం చాలా సులభం అని తేలిందని తెలుస్తుంది. ఈ సమయం లో మోసాల కు గురైన వారిని కొంతమంది నిపుణులు ఇంటర్వ్యూ చేయగా... మోసపోయిన కూడా ఆ విషయాన్ని బహిర్గతం చేయడానికి వారు ఇష్టపడరని చెప్పారంట.
ఫలితంగా... అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలిందని అంటున్నారు. దీంతో... ఎక్కువమంది మోసం చేయాలనుకునేవారికి.. ఇలా సంపన్నులే మొదటి టార్గెట్ అని అంటున్నారు!!