Begin typing your search above and press return to search.

సగం జీతమే ఇస్తాం.. ఇష్టం ఉంటే చేయండి, లేదంటే వెయిట్‌ చేయండి

By:  Tupaki Desk   |   22 Feb 2023 11:00 AM GMT
సగం జీతమే ఇస్తాం.. ఇష్టం ఉంటే చేయండి, లేదంటే వెయిట్‌ చేయండి
X
ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌ వేర్ కంపెనీలు ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ఉద్యోగులకు కోత పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం తమ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీతాలను కట్‌ చేస్తున్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే అదనపు చెల్లింపులు మరియు ఫెసిలిటీస్ ను కట్‌ చేయడం జరిగింది.

తాజాగా ప్రముఖ సాఫ్ట్‌ వేర్ కంపెనీ అయిన విప్రో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చితి కారణంగా ఇప్పటికే సెలెక్ట్ అయిన ఫ్రెషర్లకు కమిట్ అయిన జీతం లో కేవలం సగం మాత్రమే చెల్లిస్తామని ఈమెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎంపిక అయిన వారిని సగం జీతానికే జాయిన్ అవ్వాలని సూచించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2022-2023 పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకుని జాబ్‌ లో జాయిన్ అవ్వబోతున్న వారికి గతంలో రూ.6.5 లక్షల రూపాయల వార్షిక వేతనం ఆఫర్ చేయడం జరిగింది. తాజా నిర్ణయం తో వారు 3.5 లక్షల రూపాయలకు మాత్రమే జాబ్‌ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

గతంలో ఆఫర్ చేసిన వార్షిక పారితోషికం ఇష్టం అయితే జాయిన్ అవ్వచ్చు అని.. ఒక వేళ ఆ సాలరీ ఇష్టం లేని వారు పరిస్థితులు చక్కబడే వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని సంస్థ అఫిషియల్‌ గా పంపించిన మెయిల్‌ లో పేర్కొనడం జరిగింది.

విప్రో తీసుకున్న ఈ నిర్ణయం పై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ఫ్రెషర్స్ లో అభద్రతా భావం పెరగడంతో పాటు వారు మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. విప్రో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. విప్రోతో ఐటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.