Begin typing your search above and press return to search.
జగ్జీవన్ రామ్ వారసత్వాన్ని కొనసాగిస్తాం: జగన్
By: Tupaki Desk | 5 April 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ వారసత్వాన్ని సీఎం జగన్ ప్రశంసించారు. "జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు.. సంస్కరణవాది అయిన బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు. పేదలు మరియు అణగారినవారికి ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మనం మరచిపోలేము, "అని సీఎం జగన్ అన్నారు.
గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశ రాజకీయాలకు, అభివృద్ధికి జగ్జీవన్ రామ్ అందించిన సహకారం ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. "బాబు జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. దూరదృష్టి గల నాయకుడు "అని హరిచందన్ అన్నారు. జగ్జీవన్ రామ్ దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన సమర్థుడైన నాయకుడు అని అన్నారు.
నిజమైన ప్రజాస్వామ్యవాది అని గవర్నర్ హరిచందన్ కితాబిచ్చాడు. సమాజంలోని పేద, అణగారిన, బలహీన వర్గాలను ఉద్ధరించడానికి పోరాడారని అన్నారు. అనేక కీలక దస్త్రాలను కలిగి ఉన్న జగ్జీవన్ రామ్ 35 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలందించారని.. దేశంలో హరిత విప్లవం వంటి గొప్ప సంస్కరణలను రామ్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
అదేవిధంగా, కర్నూలు పట్టణంలోని సరీన్ నగర్ పార్క్ వద్ద స్థానిక నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన స్మారక చిహ్నం వద్ద కర్నూలు కలెక్టర్ వీర్‌పాండియన్ కేక్ కట్ చేశారు.