Begin typing your search above and press return to search.

రైతుల వెంటే కాంగ్రెస్.. రాహుల్, ప్రియాక ప్రకటన

By:  Tupaki Desk   |   29 Jan 2021 5:30 AM GMT
రైతుల వెంటే కాంగ్రెస్.. రాహుల్, ప్రియాక ప్రకటన
X
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రైతుల వెంటే అని ప్రకటించేసింది. ఢిల్లీలో రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీ సర్కార్ కు హెచ్చరికలు పంపింది. ఢిల్లీలో హింసకు పాల్పడిన రైతులపై కేసులు పెట్టడం.. వారి నిరసన గుడారాలను పోలీసులు తీసివేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల టెంట్లను పోలీసులు తొలగించడంపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతులవైపే ఉంటామని స్పష్టం చేశారు.

‘ఏవైపో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.. నేను ప్రజాస్వామ్యంతోనే ఉంటాను. రైతుల వెంటే ఉన్నాను. వారి శాంతియుత ఉద్యమానికి మద్దతిస్తాను’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని ముగించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు రైతులకే అని ప్రియాంక తేల్చిచెప్పారు.

కాగా రైతుల ఉద్యమంపై పార్లమెంట్ లోనూ నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామన్న పార్టీల్లో.. కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ తదితర పార్టీలున్నాయి.