Begin typing your search above and press return to search.

'భజరంగ్ దళ్' ను బ్యాన్ చేస్తాం.. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో సంచలనం

By:  Tupaki Desk   |   2 May 2023 1:05 PM GMT
భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తాం.. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో సంచలనం
X
హాట్ హాట్ గా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఓపక్క ఊరించే పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చిన పార్టీ.. మరోవైపు హిందూ అతివాదన సంస్థలపై గట్టి చర్యలు ఉంటాయన్న విషయాన్ని చెప్పిన తీరు సంచలనంగా మారింది. భజరంగ్ దళ్.. పీఎఫ్ఐ.. తదితర సంస్థలు.. వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆందోళనలు చేస్తే.. అలాంటి సంస్థలు.. వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. "అవసరమైతే ఆ సంస్థల్ని పూర్తిగా బ్యాన్ చేసేందుకు చట్టపరంగాముందుకు వెళతాం" అంటూ హామీ ఇచ్చింది.

ఆకర్షణీయమైన పథకాలను మేనిఫెస్టోలో చేర్చకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అలివి కాని హామీల్ని ప్రజలకు చెప్పటం కన్నా.. చేసే పనుల్ని మాత్రమే చెబుతామన్న సిద్ధాంతానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న మాట వినిపిస్తోంది. ఆచరణ సాధ్యం కాని అంశాల్ని మేనిఫెస్టోలో చేర్చకూడదన్న సిద్దాంతానికి తాము కట్టుబడి ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లోకీలకంగా మారినవి చూస్తే..

- గృహ జ్యోతి, గృహలక్ష్మీ, అన్న భాగ్య, యువ నిధి, శక్తి. ఉద్యోగాల కల్పన కింద వివిధ వర్గాల వారికి మేలు కలిగే చర్యలు.
- గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- గృహ లక్ష్మి కింద ప్రతి ఇంటి ఇల్లాలికి నెలకు రూ. వెయ్యి
- అన్నభాగ్య పథకం కింద ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం
- శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం
- యువజన నిరుద్యోగ భృతికింద నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి (రెండేళ్ల పాటు) డిప్లమా చేసిన వారికి రూ.1500.
- 2006 నుంచి సర్వీసుల్లో చేరిన పెన్షన్ అర్హత కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ ను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తాం.
- నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5వేల ప్రత్యేక అలవెన్సు ఇస్తాం
- పీడబ్ల్యూడీ.. నీటి పారుదల.. విద్యుత్ తదితర రంగాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రత్యేక చట్టం
- బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్యాయమైన.. ప్రజా వ్యతిరేక చట్టాల్ని రద్దు చేస్తాం.
- మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చూస్తాం. రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కు పెంచుతాం.