Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు కారా? అరెస్టు భయం మాత్రమే చూపిస్తారా?
By: Tupaki Desk | 8 March 2023 10:52 AM GMTసవాలచ్చ పంచాయితీలు ఉండొచ్చు. కొన్నిగీతల్ని అస్సలు టచ్ చేయకూడదు. ఒకసారి టచ్ చేసిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలు.. టచ్ చేసిన వారికి సైతం భారీ నష్టాన్ని కలిగించేలా చేస్తుంటాయి. ఇలాంటి విషయాలు తెలియనంత అమాయకులేం కాదు మోడీషాలు. తరచి చూస్తే.. తాము టార్గెట్ చేసిన వారి ఆర్థిక మూలాల్ని భారీగా డ్యామేజ్ చేయటం.. రాజకీయంగా కోలుకోకుండా చూడటమే తప్పించి.. ఇతరత్రా సీరియస్ చర్యలకు మాత్రం దిగరన్న వాదనను పలువురు వినిపిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్యవహరించే ధోరణి ఇందుకు భిన్నంగా ఉన్నప్పటికీ.. రోటీన్ గా మాత్రం వారి తీరు చాలా క్లియర్ గా ఉంటుందని చెబుతారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ విచారణ ఇప్పుడు కీలకదశకు చేరుకుందని చెప్పాలి. ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లై నోటి నుంచి తాను ఎమ్మెల్సీ కవిత కోసం పని చేస్తున్నట్లుగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు.. తన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పలుసార్లు ప్రస్తావించటం తెలిసిందే. ఇలాంటి వేళ.. తర్వాతేం జరుగుతుంది? అన్నది ప్రశ్నగా మారింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సైతం జైల్లో వేసిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు అరెస్టు ఇబ్బంది తప్పదా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. ఒక వర్గం ఆమె అరెస్టు ఖాయమని.. తాజాగా కోర్టుకు సమర్పించిన ఈడీ నివేదికతో ఈ అంశంపై క్లారిటీ వచ్చేసినట్లుగా చెబుతున్నారు. తర్వాత జైలుకు వెళ్లేది కవితేనంటూ వాదిస్తున్నారు.
అయితే.. దీనికి సంబంధించి మరో బలమైన వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా సరే.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే అవకాశం ఉండదంటున్నారు. దీనికి కారణం.. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకున్నా.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినంతనే భావోద్వేగాల్ని తట్టి లేపే శక్తి ఉన్న కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే.. కవితను అరెస్టు చేసే కన్నా.. అరెస్టు భయాన్ని చూపించేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న వేళలో.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన పక్షంలో ఆ విషయాన్ని రాజకీయం చేసి.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరిగిందన్న ప్రచారం చేస్తే.. బీజేపీ తీవ్రంగా నష్టపోయే వీలుంది. ఇలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతున్నారు. వీలైనంతవరకు ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం స్కాంలో బలమైన సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటమే ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు.
"ఇప్పటికైతే ఏం చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. కవితను అరెస్టు చేస్తే మాత్రం.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందన్న ముద్ర పడుతుంది. అంతే తప్పించి.. ఆమె తప్పు చేశారన్న విషయం మరుగున పడుతుంది. అందుకే అలాంటి అవకాశం ఇవ్వరు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టు వ్యవహారం వేరు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు వేరు. అందుకే ఆచితూచి నిర్ణయాలు ఉంటాయి" అంటూ ఒక బీజేపీ కీలక నేత చేసిన వ్యాఖ్యను చూస్తే.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై కాస్తంత అవగాహన రాక మానదు.
బండి సంజయ్ తో పాటుపలువురు తెలంగాణ బీజేపీ నేతలు కవిత అరెస్టు ఖాయమని చెప్పటం కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. తొందరపాటుతో వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీని ఆత్మరక్షణలో పడేలా చేస్తున్నాయంటున్నారు. ఏమైనా.. అరెస్టు కంటే అరెస్టు చేస్తారన్న భయాందోళనల్లో ఉంచటానికే అధిక ప్రాధాన్యత ఇస్తారన్న మాట వినిపిస్తోంది. నిజానికి అరెస్టు కంటే కూడా అరెస్టు భయంతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న మాట ఒక బీజేపీ నేత మాటల్లో వినిపించటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.