Begin typing your search above and press return to search.
కళ్లుతెరిచిన డబ్ల్యూహెచ్‌వో.. కరోనా వూహాన్లో పుట్టిందా? అని ఇన్వెస్టిగేషన్
By: Tupaki Desk | 23 Dec 2020 4:30 PM GMTకరోనా చైనా దేశం వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే పుట్టిందని చాలా కాలంగా సైంటిస్టులు ఆరోపిస్తున్నారు. అక్కడి మాంసం దుకాణాల్లో పుట్టిఉండవచ్చని మరికొందరి వాదన. అయితే కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటికే మిస్టరీయే నెలకొన్నది. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా మేల్కొన్నది. కరోనా వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే పుట్టిందా.. అనే విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఓ టీం పరిశోధన సాగించనున్నది.
కరోనా వైరస్ సహజసిద్ధంగానే ఏర్పడిందా? లేక వూహాన్ల్యాబ్లో పుట్టి ప్రపంచదేశాలకు వ్యాపించిందా అన్న విషయంపై వీళ్లు పరిశోధనసాగించనున్నారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో విచారణ సాగించనున్నది. దీనిపై వూహాన్‌లోని ల్యాబ్‌లో చీఫ్ వైరాలజీ సైంటిస్టుగా ఉన్న 56 ఏళ్ల ప్రొఫెసర్ షీ జెంగ్లీ స్పందించారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధుల రాక గురించి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు చెందిన విలేకరితో ఆమె మాట్లాడారు. కరోనా వైరస్‌పై విచారణ జరిపేందుకు ఎవరు వచ్చినా తాము సహకరిస్తాం.. అని ఆమె అన్నారు. వూహాన్ ల్యాబ్ చుట్టుపక్కలకు కూడా ఎవరూ వెళ్లలేరు. అక్కడ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఇటీవల కొందరు జర్నలిస్టులు వూహాన్ ల్యాబ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. ఫొటోలు కూడా తీయనీయలేదు. వూహాన్ వైరాలజీ ల్యాబ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ షీ జెంగ్లీ గతంలో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.