Begin typing your search above and press return to search.
రెండో మ్యాచ్ లోనూ క్రికెట్ దేవుడి టీం ఓడింది
By: Tupaki Desk | 12 Nov 2015 8:53 AM GMTదిగ్గజ క్రికెటర్ల మధ్య అమెరికాలో సాగుతున్న రెండో టీ20 మ్యాచ్ ముగిసింది. క్రికెట్ దేవుడు సచిన్ నేతృత్వం వహిస్తున్న సచిన్ బ్లాస్టర్స్ జట్టు.. వార్న్ వారియర్స్ చేతిలో మరోసారి ఓడిపోయింది. అమెరికాలో క్రికెట్ మీద అభిమానం పెంచేందుకు.. ఆటకు విశేష ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు సచిన్.. వార్న్ లు కలిసి మూడు మ్యాచ్ ల సిరీస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో వార్న్ జట్టు విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లోనూ వార్న్ జట్టు గెలిచింది.
అమెరికాలోని హుస్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ 5 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో వారియర్స్ జట్టు సంగక్కర 30 బంతుల్లో.. ఆరు సిక్స్ లు.. ఆరు ఫోర్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం సిక్స్ లు.. ఫోర్లతోనే 60 పరుగులు రావటం విశేసం. అంటే.. కేవలం 12 బంతులకు 60పరుగులన్న మాట (సిక్స్ లు.. ఫోర్లు లెక్కిస్తే..).. పాంటింగ్ సైతం తన విధ్వంసక బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లో 41 రన్స్ సాధించాడు. ఇతను సాధించిన 41 పరుగుల్లో మూడు సిక్స్ లు.. ఐదు ఫోర్లతో చేశాడు. అంటే.. కేవలం ఎనిమిది బంతుల్లోనే 38 పరుగులు చేశాడన్న మాట. మొత్తం పాంటింగ్ చేసిన పరుగుల్లో మూడు పరుగులు మాత్రమే.. ఒకటి.. రెండు పరుగులు తీయటం గమనార్హం.
సంగక్కర.. పాంటింగ్ తో పాటు.. వాన్ (30).. హెడెన్ (32).. కలిస్ (45).. సైమండ్స్ (19).. జాంటీ రోడ్స్ (18) పరుగు చేశారు. వార్న్ వారియర్స్ జట్టు తన 20 ఓవర్లలో 21 సిక్స్ లు (126).. 22 ఫోర్లు (88) కొట్టారు. అంటే.. 43 బంతుల్లో సిక్స్ లు.. ఫోర్ల ద్వారా వచ్చిన మొత్తం పరుగులు 214 కావటం గమనార్హం. మొత్తం 262 పరుగుల్లో.. 48 పరుగులు మాత్రమే ఒకటి.. రెండుగా వచ్చినవంటే.. వార్న్ వారియర్స్ బ్యాటింగ్ జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన సచిన్ బ్లాస్టర్స్ జట్టులోఒక్క పొలాక్ మాత్రమే 55 పరుగులు చేశారు. ఈ స్కోర్ ను 22 బంతుల్లో సాధించాడు. సచిన్ 20 బంతుల్లో 33 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించకపోవటంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. సచిన్ జట్టు వెన్ను విరవటంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. ఇతగాడు పరుగులు ధారాళంగా ఇచ్చినా నాలుగు విలువైన వికెట్లు కూల్చాడు. ముస్తాక్ రెండు.. అగార్కర్.. కలిస్ చెరో వికెట్లు తీశారు. ఓవైపు వికెట్లు పడిపోవటంతోఒత్తిడికి గురైన సచిన్ బ్లాస్టర్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది.