Begin typing your search above and press return to search.

కలెక్ట‌ర్ అమ్ర‌పాలిపై కేటీఆర్ అస‌హ‌నం!

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:31 PM GMT
కలెక్ట‌ర్ అమ్ర‌పాలిపై కేటీఆర్ అస‌హ‌నం!
X

జిల్లా క‌లెక్ట‌ర్ హోదాలో విధులు నిర్వ‌రిస్తూ కేవ‌లం వ‌రంగ‌ల్ అర్బ‌న్ వాసుల‌కు మాత్ర‌మే ప‌రిపాల‌న అధికారిగా ఉన్న జిల్లా ప‌రిపాల‌న అధికారిణి అమ్ర‌పాలి...త‌న అధికార విధులు స‌హా ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల్లో చురుకుగా పాల్గొనే తీరుతో తెలుగు వారంద‌రికీ సుప‌రిచితులనే సంగ‌తి తెలిసిందే. ట్రెక్కింగ్ ప్రారంభిస్తూ హుషారుగా కొండ‌లు ఎక్క‌డ‌మైనా... టిక్కెట్లు కొనిచ్చి మ‌రీ బాహుబ‌లి సినిమా చూపించ‌డం అయినా...అది క‌లెక్ట‌ర్‌ అమ్రపాలికి మాత్ర‌మే సాధ్యం. అలా త‌న‌దైన శైలిలో విభిన్న రీతిలో వ్య‌వ‌హ‌రించే అమ్ర‌పాలికి తాజాగా మంత్రి కేటీఆర్ చేతిలో చేదు అనుభ‌వం ఎదురైంది. వరంగల్ నగర అభివృద్ధిపై వరంగల్ అర్భన్ కలక్టరేట్‌ లో అధికారులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

వ‌రంగ‌ల్ ప‌రిధిలో అభివృద్ధి పనుల‌పై ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రితో క‌లిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై కడియం, కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పనుల్లో అధికారుల తీరు సరిగా లేదని మందలించారు. రోడ్లు వేశాక పైపులైన్లు వేయడమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సీఎం చెప్పిన పనులు కూడా చేయకపోతే ఇంకేమి చేస్తారని నిలదీశారు. కలెక్టర్ ఆమ్రపాలి, కమిషనర్ శ్రుతి ఓజాలకు ఇలా వ‌రుస‌ ప్రశ్నలు వేయ‌డంతో వారు ఖంగుతిన్నారు. పనిచేసే మూడ్ లోకి రండి అంటూ అధికారులకు హితవు ప‌లికారు. ఉప‌ముఖ్య‌మంత్రి, మంత్రి కేటీఆర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు లేక ఈ ఇద్ద‌రు తడుముకున్నారు. అనంత‌రం మంత్రి కేటీఆర్‌కు చేతులు జోడించి క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి, క‌మిష‌న‌ర్ ఓజా ఓ విష‌యంపై అభ్య‌ర్థించ‌డం క‌నిపించింది.

ఈ సంద‌ర్భంగా ప‌నులు సాగుతున్న‌ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రితో క‌లిసి మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. నియోజక వర్గ పరిధిలతో మొండి పంచాయతీలు వద్దని ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశనం చేశారు. ఇళ్లు కావాలో..గ్రామాలు కావాలో తేల్చుకోవాల‌ని ఎమ్మెల్యే వినయ్ కు సూచించారు. డబుల్ బెడ్రూంలను పూర్తి చేయించే బాధ్యత ఎమ్మెల్యేలదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఏడాదిలోగా కచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్ని పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు. సీఎం చెప్పిన పనులకు రేపే టెండర్లు పిలవండి...మంజూరీలిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. 24వ తేదీలోపు సీఎం చెప్పిన పనులకు టెండర్లు పిలిచి త‌న దగ్గరకు రావాలని హుకుం జారీచేశారు.