Begin typing your search above and press return to search.

క‌రోనాపై యుద్ధంః రంగంలోకి రైలు బండ్లు!

By:  Tupaki Desk   |   26 April 2021 1:30 AM GMT
క‌రోనాపై యుద్ధంః రంగంలోకి రైలు బండ్లు!
X
దేశంలో క‌రోనా క‌ల్లోలం భ‌యాన‌క స్థాయికి చేరుతోంది. నిత్యం ల‌క్ష‌లాది కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో.. గంట‌కు 109 మంది చొప్పున రోగులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌తీ ఐదుగురిలో ఒక‌రికి వైర‌స్ వ్యాపించిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. దీంతో.. ఏం జరుగుతుందో అర్థంకాని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటు ల‌క్ష‌లాదిగా కేసులు పెరుగుతుండ‌డంతో ఆసుప‌త్రులన్నీ నిండిపోయాయి. డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం.. ఆసుప‌త్రికి వ‌చ్చే వారి సంఖ్య భారీగా ఉండ‌డంతో బెడ్లు దొర‌క‌ట్లేదు. దీంతో.. చాలా మందికి స‌రైన చికిత్స ల‌భించ‌క ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. మ‌రోసారి రైల్వే రంగంలోకి దిగింది. మొద‌టి ద‌శ‌లో రైల్వే బోగీల‌ను కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చిన సంగ‌తి తెలిసిందే. బోగీల్లో వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించి, రోగుల‌కు చికిత్స అందించారు. ఇప్పుడు కూడా ఆసుప‌త్రుల‌న్నీ నిండిపోవ‌డంతో.. మ‌రోసారి రైలు బోగీల‌ను కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చేందుకు రైల్వే అధికారులు సిద్ధ‌మ‌య్యారు.

మొత్తం 3,816 రైల్వే కోచ్ ల‌ను క‌రోనా బోగీలుగా మార్చిన‌ట్లు రైల్వేశాఖ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే.. మ‌హారాష్ట్ర‌-నందూర్ బ‌ర్ జిల్లాలో 21 కోచ్ ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్టు చెప్పారు. మిగిలిన‌వి ద‌శ‌ల‌వారీగా.. అవ‌స‌రాలు ఉన్న చోట ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపింది.