Begin typing your search above and press return to search.

చనిపోయాక ఏం జరుగుతుందో చూడాలనుకుంది

By:  Tupaki Desk   |   15 May 2021 6:30 AM GMT
చనిపోయాక ఏం జరుగుతుందో చూడాలనుకుంది
X
జిహ్వకో చాపల్యం.. పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు. ఇప్పుడు ఒక ముసాలవిడ కూడా అలానే ఆలోచించింది. ఓ మహిళ తాను బతికి ఉండగానే చచ్చిపోతే ఏం జరుగుతుందో చూడాలనుకుంది. చనిపోతే ఎవరెవరు వస్తారు? వారు ఏం చేస్తారో చూడాలనుకుందట.. అందుకే తాను మరణించినట్లు నమ్మించడానికి పడరాని పాట్లు పడింది.

చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తన చుట్టు ఏం జరుగుతుందో చూడాలనుకుంది. ఆ కోరిక నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమె డెత్ రిహార్సల్స్ చేసి మరీ అద్దెకు లగ్జరీ శవపేటికను తీసుకొచ్చింది. అంతా సిద్ధం చేసుకొని తెల్లటి దుస్తులతో మైరా ముక్కులతో దూది పెట్టుకొని శవపేటికలో శవంలా పడుకొని చనిపోయినట్లు నటిస్తూనే ఉంది.

అయితే ఆమె ఇలా చేయడానికి కుటుంబం, స్నేహితులంతా మద్దతు తెలిపి వాళ్లు కలరింగ్ ఇస్తూ బోరున ఏడ్వడం మొదలు పెట్టారు.. తర్వాత ఆమె తన చావుకు ఎవరెవరు వచ్చారో చూసుకొని కాస్త కుదుటపడింది.అయితే ఇలా చనిపోయిందని నాటకం ఆడడానికి ఆమె ఏకంగా 710 యూరోలు ఖర్చు చేసింది. ఈవిడ పిచ్చిపై చాలా మంది చాలా విమర్శలు చేశారు.