Begin typing your search above and press return to search.
ఆండ్రాయిడ్ మొబైల్స్ కు అతిపెద్ద ముప్పు?
By: Tupaki Desk | 18 May 2017 9:56 AM GMTవానా క్రై రాన్సమ్ వేర్ అటాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో బిగ్ షాకింగ్ న్యూస్. ఇలాంటి భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. అయితే ఈసారి దాడి డిఫరెంటుగా ఉంటుందని... మరింత డేంజరస్ అని... రాన్సమ్ వేర్ నెక్స్ట్ టార్గెట్ స్మార్టుఫోన్లేనని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ హెచ్చరించారు.
అరచేతిలో ప్రపంచాన్ని నిలుపుతున్న స్మార్ట్ ఫోన్లే తరువాతి టార్గెట్ అని సంజయ్ చెప్తున్నారు. గత శుక్రవారం విజృంభించిన ఈ వన్నాక్రై అటాక్ తో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే డెస్క్ టాప్స్ - ల్యాప్ టాప్స్ స్తంభించాయి. పీసీల డేటా అంతా తమ గుప్పిట్లోకి తీసుకుని ఈ అటాకర్లు నానా హంగామా చేశారు. మరోసారి విజృంభించబోయే వన్నాక్రై అటాక్ స్మార్ట్ ఫోన్లకేనని తెలియడంతో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
మొబైల్స్ లో అత్యధికులు వాడేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకవేళ హ్యాకర్లు కనుక దీన్నే టార్గెట్ చేస్తే, ప్రపంచమంతా ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదని సంజయ్ చెప్పారు. హ్యాకర్లు రెండు దశలో ముందుకు వెళ్తున్నారని, అయితే తర్వాత ఏంటన్నది తెలియడం లేదని చెప్పారు. ఒకవేళ ఈ అటాక్స్ ను ఆపవచ్చు లేదా వేరియంట్లను టార్గెట్ చేసి మరోమారు తమ ప్రతాపం చూపవచ్చని తెలిపారు. బ్యాంకులకు, పవర్ యుటిలిటీస్ కు, రైల్వేస్, ఇతర కీలక ఇన్ ఫ్రాక్ట్ర్చర్ ప్రొవేడర్లకు అలర్ట్ లు పంపుతూనే ఉన్నామని, తర్వాత అటాక్ కు ముందస్తుగా ప్రైవేట్ వ్యక్తులతో డైరెక్ట్ గా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
కాగా వన్నాక్రై అటాక్ పై అధ్యయనం చేయడానికి ఏజెన్సీ ఓ టీమ్ కూడా నియమించింది. హ్యాకర్లు తర్వాతి టార్గెట్ స్మార్ట్ ఫోన్లే నిజమైతే, ప్రపంచానికి తీవ్ర ముప్పే వాటిల్లనుందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/