Begin typing your search above and press return to search.
అణచివేస్తామన్న పుతిన్.. ఆయన్నే మార్చేస్తామంటున్న వాగ్నర్
By: Tupaki Desk | 24 Jun 2023 6:00 PM GMTకేవలం 6 వేల మంది ఉండే మాజీ సైనికుల కిరాయి మూక ప్రపంచంలోనే అతి పెద్దదైన దేశాన్ని సవాల్ చేస్తోంది. మిలటరీ, ఇంటెలిజెన్స్ వర్గాలు నియంత్రణ లోని ఈ చిన్న మూక.. ఏకంగా దేశ అధ్యక్షుడినే మార్చేస్తామంటోంది.. ఇదంతా వాగ్నర్ గ్రూప్- రష్యా మధ్య జరుగుతున్న సంవాదం. సొంత ప్రయోజనాల కోసం వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాకు ద్రోహం చేస్తున్నాడని అధ్యక్షుడు పుతిన్ నిప్పులు చెరుగుతున్నారు.
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో.. దేశ ప్రజలనుద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ప్రజల ను రక్షించుకునేందుకు తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ను రష్యాకు వెన్నుపోటుగా అభివర్ణించి.. ఇది దేశ ద్రోహచర్య అని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటుదారుల పై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇంతకూ ఏమిటీ వాగ్నర్ అంటే.. ఇదొక కిరాయి సైన్యం.
లిబియా సివిల్ వార్, సిరియా, మోజాంబిక్, మాలి, సుడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనుజువెలా ఇలా పలు దేశాల్లో వాగ్నర్ గ్రూప్ కార్యకలాపాలున్నాయి. సిరియా లో రష్యాకు అనుకూలుడైన షర్ అల్ అసద్
ప్రభుత్వాన్ని కాపాడడంలో వాగ్నర్ గ్రూప్ దే ప్రధాన పాత్ర. ఇక ఉక్రెయిన్ లోనూ రష్యాకు అండగా పోరాడింది. ఇటీవల బఖ్ ముత్ నగరం సొంతం చేసుకోవడంలో వాగ్నర్ సైన్యానిది కీలక పాత్ర. ప్రైవేటు సైన్యం నిర్వహించడం చట్టప్రకారం నేరమైనప్పటికీ రష్యాలో వాగ్నర్ గ్రూప్ నకు ఎదురులేదు.
అయితే దీనికి కొన్ని కారణాలున్నాయి. సైనిక శిక్షణ పొందిన కిరాయి మనుషులు దొరకడం, విదేశాల్లో తమ లక్ష్యాలను సాధించేందుకు సొంత మనుషులను పంపాల్సిన పనిలేకపోవడం, ఏదైనా జరిగితే తమకు సంబంధంలేదని తప్పించుకొని.. విదేశీ సంబంధాల ను కాపాడుకోవడం తదితర ప్రయోజనాల రీత్యా రష్యా వాగ్నర్ గ్రూప్ ను ఉపేక్షించింది. అయితే, కావాల్సి వస్తే ఈ గ్రూప్ ను రష్యా సైన్యం నిర్మూలించే అవకాశం ఉంది. అలానే గ్రూప్ చేసిన నేరాల ను రష్యా పై రుద్దకుండా ముందుజాగ్రత్తగా ఏర్పాటు చేసుకొన్నట్లు ఆరోపణలున్నాయి. తాజా పరిణామాల రీత్యా వాగ్నర్ గ్రూప్ ను పుతిన్ ఏం చేస్తారో చూడాలి.
ఆ షెఫ్.. ఇప్పుడు ఏకు మేకు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్. పుతిన్ షెఫ్ గా ఈయన్ని పిలుస్తుంటారు. ఆంతరంగికుడు కూడా. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 1990ల్లో పుతిన్ తో పరిచయమైంది. 2000లో పుతిన్ అధ్యక్షుడు అయ్యారు. ఇక ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణ లో ప్రిగోజిన్ పాత్ర బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో 'లిటిల్ గ్రీన్‌మ్యాన్' రూపం లో వాగ్నర్ గ్రూప్ తోడ్పాటు అందించింది.
2016లో ప్రిగోజిన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్ అని ఆరోపణలు ఉన్నాయి. వాగ్నర్ పీఎంసీ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ఈ గ్రూప్ ను ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నర్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. ఉత్కిన్- ప్రిగోజిన్ కు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిగోజిన్ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండటంతో వాగ్నర్ గ్రూప్‌కు ఎదురు లేకుండా పోయింది.