Begin typing your search above and press return to search.
ఇంటి నుంచే ఓటు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచే షురూ
By: Tupaki Desk | 12 March 2023 6:00 PM GMTకేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మరికొద్ది నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసే విషయనికి సంబంధించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. తాజాగా విధానంలో 80 ఏళ్లకు పైబడిన వారంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. క్యూలైన్లో నిలబడి ఓటు వేసే శ్రమ ఉండదు. అందుకోసం ఇంట్లో వారు హైరానా పడాల్సిన అవసరం లేదు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వారు ఓట్లు వేసేందుకు వీలుగా నిర్ణయాన్ని తీసుకున్నారు.
80 ఏళ్లు దాటిన వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలా వెళ్లలేని వారి కోసం తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని తాము అందుబాటులోకి తెస్తున్నట్లుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అదెలా అన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. "సక్షమ్ " అనే మొబైల్ యాప్ ను రూపొందించామని.. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటు వేసే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుందన్నారు.
వారిచ్చే ఫామ్ 12డి ద్వారా ఓటు వేయొచ్చని.. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తామని.. గోప్యతకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. అదే విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను.. అఫిడవిట్లను ఆన్ లైన్ లో దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరుతో మరో మొబైల్ యాప్ రూపొందించినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా కొత్త పుంతలు తొక్కుతున్న సీఈసీ ఇదే జోరుతో మరిన్ని కొత్త పద్దతుల్ని అందుబాటులోకి తసుకురావాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.