Begin typing your search above and press return to search.
ఇదేం తల్లి? కూతుర్ని హీరోయిన్ చేసేందుకు ఇంజెక్షన్లు
By: Tupaki Desk | 3 Jun 2023 1:00 PM GMTఅమ్మతనానికి మాయని మచ్చగా వ్యవహరించే కొందరు అమ్మలు ఉంటారు. ఈ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. విజయనగరం పట్టణానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఒకరు ప్రభుత్వ హెల్ప్ లైన్ 1098 కుఫోన్ చేసి ఫిర్యాదు చేయటంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారిని రెస్య్కూ చేసిన సందర్భంగా ఆ బాలికచెప్పిన మాటలు విని షాక్ తిన్నారు. కన్న కూతురి విషయంలో ఇలా చేయటమా? అని నిర్ఘాంతపోయే పరిస్థితి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఒక మహిళ (40) ఉంటోంది.
ఒక పాప పుట్టిన తర్వాత ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లాడింది. అతనితో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వదిలేసిన అతను.. తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటోంది. మొదటి భర్తతో పుట్టిన 15 ఏళ్ల బాలిక విశాఖపట్నంలోని ప్రభుత్వ విద్యా సంస్థలో పదో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది.
అయితే.. ఇంటికి రోజూ ఎవరో ఒకరు రావటం.. అక్కడి వాతావరణం ఆమెకు అస్సలు నచ్చలేదు. దీంతో.. ఆమె తల్లితో గొడవ పడేది. అయితే.. ఈ మధ్యన ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి.. బాధితురాలిని చూసి.. హీరోయిన్ అయ్యే లక్షణాలు ఆ పాపలో కనిపిస్తున్నాయని..కొన్ని అవయువాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు ఇవ్వమని సలహా ఇవ్వటంతో.. ముందు వెనుకా ఆలోచించకుండా ఇంజెక్షన్లు ఇవ్వటం మొదలుపెట్టింది.
ఎంత చెప్పినా వినకుండా.. బాలికకు బలవంతంగా ఇంజెక్షన్లు ఇప్పించటం.. భరించలేని నొప్పితో ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో గురువారం రాత్రి 1098 కు ఫోన్ చేసి.. తన వేదనను తెలియజేసింది. దీంతో.. స్పందించిన జిల్లా అధికారులు పోలీసుల సాయంతో బాలిక ఇంటికి వెళ్లి.. ఆమెను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం విశాఖలోని స్వధార్ హోంకు పంపారు. కేసు నమోదు చేసి దిశ పోలీసులు ఈ కేసును టేకప్ చేశారు. బాధితురాలి తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.