Begin typing your search above and press return to search.
వివేకా హత్యలో కుమార్తె, అల్లుడుకు సంబంధం లేదు: సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు!
By: Tupaki Desk | 25 April 2023 10:29 AM GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, ఈయన సోదరుడు శివప్రకాష్ రెడ్డిలకు సంబంధం లేదని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లోని అంశాలను సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇటీవల వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ సమయంలో సీబీఐ సమర్పించిన రిమాండ్ నివేదికలోని అంశాలనూ ప్రస్తావించింది. ఆ అంశాలు ఇలా ఉన్నాయి...
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య, తదనంతరం సాక్ష్యాల చెరిపివేత కుట్రలో పాలుపంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అలాగే హత్య తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించాడు. నిందితులను చూసిన వివేకా ఇంటి వాచ్ మన్ రంగన్నను బెదిరించినట్లు తేలింది. అందువల్ల 2022 జనవరి 31న దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పేర్లను సీబీఐ చేర్చింది.
ఇక వివేకా హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇతరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో అందించాం. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
వివేకాను హత్య చేయడం, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం విస్తృత కుట్రలో భాగమే. దీనివల్ల లబ్ధి పొందింది.. అవినాష్ రెడ్డే. ఈయన అనుచరులు ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి వివేకాను హత్య చేశారు.
హత్య తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడం వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల సమక్షంలో, వారి ఆదేశాల మేరకే జరిగింది. సాక్ష్యాలను ధ్వంసం చేయడం చూశామని పలువురు సాక్షులు చెప్పారు. అందువల్ల ఈ హత్య వెనుక వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలు పూర్తి నిరాధారం.
ఇక వైఎస్ వివేకానందరెడ్డి షేక్ షమీమ్ అనే మహిళను 2010లో వివాహం చేసుకొని ఆమెతో సంబంధాలు కొనసాగించడం నిజమే. దీనిపట్ల వివేకా కుటుంబం సంతృప్తిగా లేరు. అయినప్పటికీ వివేకాను హత్య చేసే ఆలోచన సునీత, ఆమె భర్త చేయలేదు. వీరి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని వివేకానందరెడ్డి .. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కక్ష గట్టి వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఇతరులు కుట్ర పన్నారు. ఈ క్రమంలో హత్యకు నెల రోజుల ముందే నిందితులకు రూ.40 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సునీల్ యాదవ్ ద్వారా షేక్ దస్తగిరికి ముందస్తుగా రూ.కోటి ముట్టజెప్పారు.
వివేకాను చంపుతున్నామని భయపడొద్దంటూ ఈ హత్యలో పాల్గొన్నవారికి ఎర్ర గంగిరెడ్డి 2019 మార్చి 15న తెల్లవారుజామున 5.20 గంటలకు ధైర్యం చెప్పాడు. తాను భాస్కర్ రెడ్డి, ఇతరులతో మాట్లాడానని, అంతా వారు చూసుకుంటారని వెల్లడించాడు. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసి వివేకా రక్తపు వాంతులు చేసుకుని గుండెపోటుతో మరణించారని కథ మొదలుపెట్టారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పీఏ రాఘవరెడ్డి ఫోన్ ద్వారా సీఐ శంకరయ్యకు కాల్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులతో చనిపోయాడని చెప్పారు. కుట్రపూరితంగా హత్యకు గురైన వ్యక్తి సాధారణంగా చనిపోయాడని కట్టుకథ అల్లారు.