Begin typing your search above and press return to search.

టీడీపీకి వివేకా బూస్ట్‌.. ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదుగా..!

By:  Tupaki Desk   |   18 April 2023 6:00 PM GMT
టీడీపీకి వివేకా బూస్ట్‌.. ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదుగా..!
X
ఏపీ టీడీపీకి అన్ని విధాలా క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు.. అంశాలు పెరుగుతున్నాయి. ఒక‌వైపు వైసీపీ ప్ర‌భు త్వంపై టీడీపీ పెద్ద ఎత్తున ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబునుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా ఎండ‌గ‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అనే నినాదాల‌తో చేప‌ట్టిన కార్య‌క్ర‌మా లు దూసుకుపోయాయి.

వీటికితోడు.. చంద్ర‌బాబు నాయుడు.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసును ఓన్ చేసు కున్నారు. వాస్త‌వానికి వైఎస్ వివేకా కేసు.. పూర్తిగా సీఎం జ‌గ‌న్‌.. వైఎస్ కుటుంబాల‌కు మాత్ర‌మే ప‌రిమితం.

అయితే.. చంద్ర‌బాబు కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు హ‌యాం లో `నారాసుర చ‌రిత్ర‌` అంటూ.. వైసీపీ నాయ‌కులు ఈ కేసును ఆయ‌న‌కు ముడిపెట్టే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో చంద్ర‌బాబు ఈ కేసు విష‌యంలో స్పందించ‌డం త‌ప్పుకాద‌నే అభిప్రాయం ఉంది.

ఇక‌, ఆది నుంచి కూడా వివేకా కేసులో బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డంలో చంద్ర‌బాబు స‌హా పార్టీ నాయ‌కులు దూకుడుగానే ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల‌కు చెందిన బీటెక్ ర‌వి.. స‌హా మాజీ టీడీపీ నాయ‌కుడు సీఎం ర‌మేష్, ఆదినారాయ‌ణ‌రెడ్డి వంటి వారు కూడా బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.

అదే స‌మ‌యంలో వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌కు సైతం టీడీపీ ప‌రోక్షంగా అండ‌గా నిలిచింది. ఆమె త‌ర‌ఫున కూడా అనేక మంది నాయ‌కులు వాయిస్ వినిపించారు.

మొత్తంగా చూస్తే.. వివేకా కేసును ఎలానూ రాజ‌కీయం చేసిన వైసీపీకి అదే రేంజ్‌లో టీడీపీ చుక్క‌లు చూపి స్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు.. ఈ కేసును బ‌లంగా ముందుకు తీసుకువెళ్ల డం ద్వారా రాజ‌కీయంగా సీఎం జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేయ‌డం..ఆయ‌న‌కు ఊపిరిస‌ల‌ప‌కుండా చేయ‌డంలో నూ టీడీపీ స‌క్సెస్ అయింద‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏమేర‌కు ఉపయోగ ప‌డుతుందో చూడాలి.