Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష రేసులో వివేక్ రంగస్వామి.. ఎవరితను?

By:  Tupaki Desk   |   18 Feb 2023 6:05 PM GMT
అమెరికా అధ్యక్ష రేసులో వివేక్ రంగస్వామి.. ఎవరితను?
X
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే అమెరికా ఎన్నికల హీట్ మొదలైంది. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న డెమొక్రాట్లకు ప్రతిపక్ష రిపబ్లికన్లు గట్టి షాకిచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రిపబ్లికన్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించారు.

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై అమెరికన్లలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచేందుకు కీలక నేతలు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. భారతి సంతతికి చెందిన నిక్కీ హేలీ.. మైక్ పాంపియో.. మైక్ పెన్స్ వంటి నేతలు అధ్యక్ష బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా మరో భారత సంతతి వ్యక్తి పేరు సైతం అమెరికా అధ్యక్ష బరిలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే 37 ఏళ్ల యువ పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి. వ్యాపారవేత్తగా.. ఇన్వెస్టర్ గా రామస్వామికి అమెరికాలో మంచి గుర్తింపు ఉంది.

బయో ఫార్మాసూటికల్ కంపెనీ.. రోయి వాంట్ సైన్సెస్ వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వోకిఇజం.. సోషల్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్ పై రామస్వామి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు.

ఈ నేపథ్యంలోనే వివేక్ రంగస్వామిని 'యాంటీ వోక్' సీఈవోగా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్క్' అభివర్ణించింది. వొకియిజం అంటే సామాజికంగా రాజకీయంగా అందరికీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత భావజలం. వోకియిజం పిడివాదంగా వివేక్ వాదిస్తుంటారు. దీంతో అతడిని యాంటి వోక్ గా న్యూయార్క్ అభివర్ణించింది. కాగా రాజకీయంగా వివేక్ రంగస్వామికి పెద్దగా అనుభవం లేదు. అయినా రిపబ్లిక్ పార్టీ తరపున నిలబడేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు భావిస్తున్నారు.

వివేక్ రంగస్వామి అభ్యర్థిత్వాన్ని పలువురు బలపరుస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా వివేక్ రంగస్వామికి రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో నిలబడే ఛాన్స్ వస్తే మాత్రం అది భారతీయులందరికీ గర్వకారణంగా మిగలడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెరపైకి భారత సంతతి వ్యక్తులు పేర్లు ఎక్కువగా విన్పిస్తుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.