Begin typing your search above and press return to search.

కరోనా నుంచి రక్షించే మరో విటమిన్ ఇదే..

By:  Tupaki Desk   |   30 Aug 2020 3:30 AM GMT
కరోనా నుంచి  రక్షించే మరో విటమిన్ ఇదే..
X
కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి జనాలు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. మంచి విటమిన్లు, ప్రోటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే విటమిన్ సీ, డీ ఫుడ్ ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. కొంతమంది ఈ విటమిన్ మాత్రలు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు కరోనా బారిన నుండి మరో విటమిన్ కూడా రక్షించగలదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెల్ బోర్న్ యూనివర్సిటీ సైన్టిస్టులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. అదే విటమిన్ బీ.

ఈ విటమిన్ ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇది కరోనాను ఎదుర్కోవడానికి సాయపడుతుందని వెల్లడించారు. సార్స్ వంటి వైరస్ ను కూడా ఇది ఎదుర్కోగలదన్నారు.ఇప్పటి వరకు ఈ విటమిన్ ను కరోనా చికిత్సలో భాగంగా రోగులకు అందించలేదు. వైద్యులు విటమిన్ సీ, డీ లకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే కరోనాను నివారించగల శక్తి విటమిన్ బీ కి కూడా ఉందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. విటమిన్-బీ రోగనిరోధక శక్తి సరైన స్థాయిలో ఉండేలా చూడడంతోపాటు కణాల పనితీరు, శక్తి జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిరోధక సైటోకిన్ స్థాయిలను తగ్గించడంతో పాటు శ్వాసకోస పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ బీ ముఖ్యంగా పాలు, గుడ్డు పచ్చ సొన, చికెన్, చేప, మాంసం, మూత్రపిండం, లివర్, పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, వెన్న, ఆలు, చిలగడ దుంపలు, డార్క్ వెజిటబుల్స్, వేరు శనగ, ఆకు కూరలు, బీన్స్, సొయా, సీడ్స్, నట్స్, సిట్రస్ పండ్లు, బనానాలలో అధికంగా లభిస్తుంది.