Begin typing your search above and press return to search.
వైసీపీ పెద్దాయనకు అగ్ని పరీక్ష
By: Tupaki Desk | 13 March 2023 8:00 AM GMTఏపీలో జగన్ కి ఇష్టమైన ప్రాంతం ఏంటి అంటే విశాఖపట్నం అని చెబుతారు వైసీపీ నేతలు. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకోవాలని వైసీపీ ప్రతిపాదిస్తోంది. అఫ్ కోర్స్ అది కోర్టులో ఉన్న విషయంగా ఉంది. అదే సమయంలో చూస్తే విశాఖకు రాజాధాని రావడం విపక్షాలకు ఇష్టం లేదని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇక ఉత్తరాంధ్రా సహా ఏపీ ప్రజలు అంతా అమరావతికే మద్దతుగా నిలుస్తారు అని కూడా విపక్ష నేతలు అంటూ ఉంటారు.
ఈ నేపధ్యంలో విశాఖ రాజధాని కావాలంటే ఎన్నికలకు వెళ్లమని మూడేళ్ళుగా విపక్షాలు వైసీపీకి సవాల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇపుడు అనుకోని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో ఫస్ట్ టైం వైసీపీ పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవడం అన్నది ఆ పార్టీకి చాలా ముఖ్యమైన విషయంగా మారింది.
ఇక చూస్తే విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన మీద ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత పడింది. వైవీ సౌమ్యుడుగా ఉంటారని చెబుతారు. ఆయన ఈ బాధ్యతలు తీసుకుని కూడా కొద్ది నెలలు మాత్రమే అయింది. ఇంతలో ఎన్నికలు పైగా ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్న ఎన్నికల్లో ఆయన ఏ విధంగా వైసీపీని ఒడ్డెక్కిస్తారు అన్నది చర్చనీయాశంగా ఉంది.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని ఒక ముతక సామెత ఉంది. అలా ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు సుబ్బారెడ్డికి అగ్ని పరీక్షనే తెచ్చాయని అంటున్నారు. నిజానికి ఆ మధ్య కాలమంతా తిరుపతి హైదరాబాద్ వయా విశాఖ అన్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి తిరిగారు. ఎపుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రకటన వచ్చిందో నాటి నుంచి ఆయన విశాఖలోనే మకాం పెట్టేశారు
కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన తన వయసుని మించి మరీ జనంలో ఉంటూ ప్రచరం చేశారు. మరి ఫలితం ఏంటో తేలనుంది. ఇక ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎపుడూ ఇంట టైట్ గా జరిగింది లేదు అని అంటున్నారు. మామూలుగా జరిగిపోయే ఎన్నికలు ఈసారి అధికార వైసీపీ విపక్ష టీడీపీ రంగంలోకి రావడంతో పూర్తిగా సాధారణ ఎన్నికలను మించిన వేడిని రాజేశాయి.
అంతే కాదు గతం కంటే కూడా లక్ష లోట్లు అదనంగా ఈసారి పెరిగిన నేపధ్యం ఉంది. దాంతో ఈ కొత్త ఓట్లు ఎవరికి ప్లస్ అన్నది కూడా చర్చకు వస్తోంది. దాంతో పాటు కచ్చితంగా ఈ సీటుని గెలవాలని వైసీపీ పడుతున్న తపనకు వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయి. ఆయన వ్యూహాలు ఎంతవరకూ గుడ్ రిజల్ట్స్ ని ఇస్తాయన్నది కూడా చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.