Begin typing your search above and press return to search.
విశాఖలో కలకలం.. మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్..
By: Tupaki Desk | 29 Jun 2023 4:19 PM GMTవిశాఖపట్నం మరోసారి వణికి పోయింది. ఇటీవలే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని, ఆయన స్నేహితుడు, ప్రముఖ ఆడిటర్‌ను కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే.. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదనేవాదన వినిపించింది. ఇదిలావుంటే.. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ అనే రియల్టర్‌తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది.
విశాఖపట్నంలోని 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే శ్రీనివాస్, లక్ష్మి దంపతులను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనివాస్, లక్ష్మి దంపతులు విజయవాడ నుంచి విశాఖకి వ్యాపారం నిమిత్తం వచ్చారు. 2021 జూన్‌లో విజయవాడలో శ్రీనివాస్‌ని పోలీసులు ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రూ.3 కోట్లు శ్రీనివాస్ కాజేశాడని ఆరోపణలు వచ్చాయి.
వాటిలో రూ.60 లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ దంపతులను దుండగులు డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ లావాదేవీల నేపథ్యంలో నే వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిపారు.
ఇదిలావుంటే.. కేవలం వారాల వ్యవధిలోనే ఇలా డబ్బు కోసం కిడ్నాప్‌లు జరుగుతున్న ఘటనలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖను ఎవరు కాపాడుతారంటూ.. ప్రశ్నిస్తున్నారు.
కొన్ని రోజుల కిందట వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కానీ, నిందితులపై కఠినంగా వ్యవహరించలేదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో అరాచకాలు పెరుగుతున్నాయని స్తానికులు గగ్గోలు పెడుతున్నారు.