Begin typing your search above and press return to search.

మెడలో రుద్రాక్ష.. నుదుటిన బొట్టు తో విరాట్ కోహ్లీ సర్ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   4 March 2023 12:00 PM
మెడలో రుద్రాక్ష.. నుదుటిన బొట్టు తో విరాట్ కోహ్లీ సర్ ప్రైజ్‌
X
టీం ఇండియా స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ స్టైల్ ఐకాన్ అనడంలో సందేహం లేదు. క్రికెటర్ అయినా కూడా హీరోల స్థాయిలో స్టార్‌ డమ్‌ కలిగిన విరాట్ కోహ్లీకి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పాపులారిటీ సొంతం అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలను సైతం వెనక్కి నెట్టేంత క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీ తాజా లుక్ వైరల్‌ అవుతోంది.

తాజాగా మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని మహా కాళేశ్వర ఆలయంలో విరాట్ కోహ్లీ సతీ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

గతంలో కూడా టీం ఇండియా క్రికెటర్స్ పలువురు ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఈసారి కోహ్లీ.. అనుష్క వంతు వచ్చింది.

పూజా సందర్భంగా షర్ట్‌ విప్పేసి నుదుటిన పెద్ద బొట్టు ధరించి మెడలో రుద్రాక్ష మాల ధరించి టవల్ ను వేసుకుని ఉన్న కోహ్లీ ని చూసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ని గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని.. భలే ఉన్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీ మరియు అనుష్క లతో ప్రత్యేక పూజలు చేయించిన ఆలయ అధికారులు ఆశీర్వచనం అందించారు. కోహ్లీ దంపతులు ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఫొటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక కోహ్లీ క్రికెట్‌ తో బిజీ బిజీగా ఉంటున్నాడు.. మరో వైపు అనుష్క కూడా సినిమాలతో బిజీగా ఉంది. కూతురు జన్మించిన తర్వాత కూడా అనుష్క వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది. ఇద్దరు వారి వారి కెరీర్‌ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి పూజలు మరియు ప్రత్యేక సందర్భాల్లో కలిసే ఉంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.