Begin typing your search above and press return to search.

వైరల్ విలేజ్.. ఆ ఇల్లు భలే గమ్మత్తు గురూ..!

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:30 AM GMT
వైరల్ విలేజ్.. ఆ ఇల్లు  భలే గమ్మత్తు గురూ..!
X
సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటివల్ల నష్టంతో పాటు లాభాలు కూడా ఉన్నాయి. ప్రపంచం అంతా ఓ కుగ్రామం లాగా మారింది. ఎక్కడ ఏ మూలనో జరిగిన వార్త కూడా క్షణాల్లో అరచేతిలో వాలుతుంది. ఖర్చు లేకుండా ఎన్నో అద్భుతాలను తెలుసుకుంటూ.. చూడగలుగుతున్నాం. వివిధ దేశాల ఆర్థిక, రాజకీయ అంశాలు, నేరాలు-ఘోరాలు, వింతలు, విశేషాలు కూడా క్షణాల్లో ప్రసారం అవుతున్నాయి. ఆయా దేశాల్లోని వింతలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇవాళ ఓ గ్రామానికి చెందిన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అక్కడ ఓ వ్యక్తినో లేక ఓ కుటుంబమో కాదు... ఏకంగా ఓ ఊరికి ఊరే వైరల్ అవుతోంది.. అందుకు కారణం అక్కడ ఉండే ఇళ్లు. మరి ఆ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా?

ఇటలీలోని చెందురిబె అనే ఓ గ్రామం ఉంది. ఆ ఊరిలో 5వేలకు పైగా జనాభా ఉంటారు. ఇరుకైన ఇళ్లతో ఆ ఊరు కిక్కిరిసి ఉంటుంది. ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇల్లు నిర్మించుకుంటారు ఆ గ్రామస్థులు. వంకలు, వంకలుగా ఆ ఊరు కాస్త డిఫరెంట్. ఈ విషయాన్ని ఓ ఫొటోగ్రాఫర్ గమనించారు. ఆయన కెమెరా లెన్స్ ఆ ఊరి ఏరియల్ వ్యూ పై పడింది. ఇంకేం ఓ అద్భుతాన్నే కనిపెట్టేశారు.

ఇరుగ్గా ఉండే ఆ ఊరు డ్రోన్ విజువల్స్ ఆండ్రియా పెరి అనే ఫోటోగ్రాఫర్ రికార్డు చేశారు. ఓ కొండపై నుంచి కొన్ని ఫోటోలు క్లిక్ మనిపించారు. సముద్ర మట్టానికి 2,400 మీటర్ల ఎత్తు నుంచి విజువల్స్ చిత్రీకరించారు. ఇక గమ్మత్తు అంతా అక్కడే ఉంది. చెందురిబె ఏరియల్ పిక్ ను చూసి ఫొటోగ్రాఫర్ తో పాటు... అక్కడివారు కూడా షాక్ అయ్యారు. వంకలు, వంకలుగా ఇరుక్కుగా ఉన్న ఆ ఊరి ఫొటో ఓ మనిషి పోలి ఉంది. వెల్లకిలా పడుకున్న మనిషి కాళ్లు, చేతులనూ చాచినట్లుగా ఉంది. ఇంకేం ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

మనిషి ఆకారంలో ఉన్న ఆ ఊరి ఫొటోలు వైరల్ గా మారాయి. ఇరుకైన ఆ ఊరిలో... ప్రజలు కాకతాళీయంగా చదునుగా ఉన్న ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ మాంచి రూపంలో విలేజ్ తయారైంది. ఇప్పుడు అది కాస్తా వైరల్ విలేజ్ గా మారింది. ఆ ఊరికి సంబంధించిన కొన్ని సిత్రాలను మీరు చూసేయండి మరి..!