Begin typing your search above and press return to search.

వైర‌ల్ వీడియోః రోడ్డుపై ఏలియ‌న్ అనుకున్నారు కానీ.. న‌గ్నంగా

By:  Tupaki Desk   |   4 Jun 2021 12:30 AM GMT
వైర‌ల్ వీడియోః రోడ్డుపై ఏలియ‌న్ అనుకున్నారు కానీ.. న‌గ్నంగా
X
గ్ర‌హాంత‌ర వాసి భూమ్మీద దిగిందంటూ సోష‌ల్ మీడియాతోపాటు, మీడియాలోనూ ఓ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది. ఆ వీడియోలోని వ్య‌క్తికి దుస్తులు కూడా లేక‌పోవ‌డం.. అచ్చం ఏలియ‌న్ మాదిరిగానే క‌నిపించ‌డంతో తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. జార్ఖండ్ నుంచి వ‌చ్చిన ఈ వీడియో సంచ‌ల‌నం రేకెత్తించింది.

జార్ఖండ్ లోని ఖర్సావన్ జిల్లాలోని సెరైకెలా ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు మిత్రులు రాత్రివేళ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో న‌గ్నంగా అచ్చం ఏలియ‌న్ మాదిరిగానే ఓ వ్య‌క్తి క‌నిపించారు. దీంతో.. తీవ్రంగా భ‌య‌ప‌డిపోయిన ఆ ఇద్ద‌రు ప‌రుగులు తీశారు. ఆ త‌ర్వాత ధైర్యం కూడ‌గ‌ట్టుకొని, అది ఎవ‌రో చూడాల‌ని వెన‌క్కు వ‌చ్చారు.

దూరం నుంచే వీడియో తీశారు. ఆ త‌ర్వాత కాస్త ద‌గ్గ‌ర‌గా వెళ్లి చూస్తే.. మ‌తిస్థిమితం లేని ఓ మ‌హిళ‌గా గుర్తించారు. ఈ వీడియో షూట్ చేసిన ఇద్ద‌రిని స్థానిక న్యూస్ ఛానల్ సంప్ర‌దించ‌గా.. వారు అస‌లు విష‌యం చెప్పారు. అయితే.. అప్ప‌టికే ఈ వీడియో వైర‌ల్ అయిపోయింది. ఏప్రిల్ 27న ఈ వీడియో షూట్ చేసిన‌ట్టు ఇద్ద‌రు మిత్రుల్లో ఒక‌రైన‌ దీపక్ తెలిపాడు.