Begin typing your search above and press return to search.

వైరల్‌ : డివోర్స్ ఫొటో షూట్‌.. ఇలా కూడా ఉంటుందా?

By:  Tupaki Desk   |   15 April 2023 3:14 PM GMT
వైరల్‌ : డివోర్స్ ఫొటో షూట్‌.. ఇలా కూడా ఉంటుందా?
X
ఎవరి జీవితంలో అయినా విడాకులు అనేది కచ్చితంగా భారమైన విషయం. ఒకటి రెండు సంవత్సరాలు కలిసి జీవితాన్ని గడిపినా కూడా ఏదో కారణంతో జీవిత భాగస్వామిని వీడటం అంటే కష్టమే. అవతలి వారు ఎలాంటి వారు అయినా కూడా కలిసి జీవితాన్ని గడపాలని అనుకునే వారు ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఇక కలిసి బతకడం అసాధ్యం అనుకున్న తర్వాత విడాకులకు సిద్ధం అవుతారు.

పెళ్లి అనేది హంగామా హంగామాగా చేసుకుంటారు.. కానీ విడాకులు మాత్రం సైలెంట్ గా కానిచ్చేస్తారు. సెలబ్రిటీల యొక్క విడాకుల గురించి మీడియాలో కథనాలు వస్తాయి కానీ సాధారణ జనాల యొక్క విడాకుల గురించి జనాలు అస్సలు పట్టించుకోరు. కానీ తాజాగా ఒక మహిళ తాను విడాకులు తీసుకున్నాను అంటూ ఒక ఫొటో షూట్ చేయించుకుని ఫొటోలతో వైరల్‌ అయ్యింది.

తాను ఇన్నాళ్ల శారీరక మరియు మానసిక హింస నుండి బయట పడ్డాను.. నాకు విడాకులు వచ్చాయి అంటూ సంతోషంగా పేర్కొంటూ లారెన్‌ బ్రూక్‌ అనే మహిళ చేసిన హడావుడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. హింసించే భర్త నుంచి విడాకులు లభించడంతో తన ఆనందానికి హద్దు లేదు అంటూ ఆమె పేర్కొంది.

సంవత్సరం పాటు భర్త నుండి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు సఫలం అయిన లారెన్‌ బ్రూక్‌ తన వెడ్డింగ్ గౌన్ తో పాటు కొన్ని ఫొటోలు ఇంకా తన మాజీ భర్త జ్ఞాపకాలను చెరిపేస్తూ ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చింది. వెడ్డింగ్ గౌన్ ను కాల్చి వేయడం తో పాటు ఫొటోలను పగుల కొట్టి షాంపైన్ బాటిల్ ను కూడా ఆమె ఓపెన్ చేసింది.

తన మాజీ మొగుడు ఉన్న ఫొటోపై కాలు పెట్టి తొక్కుతున్నట్లుగా కూడా ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో షూట్ చూస్తూ ఉంటే ఆమె లోని కసి కనిపిస్తుందని.. ఇన్నాళ్లు అతడితో ఎంతగా బాధలు పడిందో పాపం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లారెన్ బ్రూక్ ఎంతో మందికి ఇక ముందు ఆదర్శంగా అన్నట్లుగా నిలిచింది. లారెన్‌ బ్రూక్‌ డివోర్స్ ఫొటో షూట్‌ ను @Pubity అనే ఇన్ స్టా పేజి షేర్ చేసింది. ఆ పేజీకి 32 మిలియన్‌ ల ఫాలోవర్స్ ఉండటంతో ఈ ఫొటోలు కాస్త ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలోనే విస్తరించాయి.