Begin typing your search above and press return to search.
వీవీఐపీలు అంతా ఒక్క చోట
By: Tupaki Desk | 20 Feb 2022 9:35 AM GMTవిశాఖ స్మార్ట్ సిటీ. అంతే కాదు, మెగా సిటీ. ఇపుడు వీవీఐపీలతో కిటకిటలాడుతున్న సిటీ. విశాఖకు ప్రధమ పౌరుడు రామ్ నాధ్ కోవింద్ వస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిల్ సై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, నేవీకి చెందిన ఉన్నతాధికారులు ఇలా విశాఖ ప్రముఖులతో అతిథులతో హడావుడిగా ఉంది.
విశాఖలో ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లీట్ రివ్యూ విశాఖలో నిర్వహించడం ఇది మూడవసారి. ఇక గతానికి భిన్నంగా ఈసారి అరవైకి పైగా విదేశీ యుద్ధ నౌకలు విశాఖకు తరలిరానున్నాయి. అలేగే యుద్ధ విమానాలు, నావికాదళ ఆయుధ సంపత్తి అంతా విశాఖలో కనిపించి కనివిందు చేయనుంది. రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ యుద్ధ నౌకల సమీక్షను చేపడతారు.
ఇక ఈ రోజు విశాఖ తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో రాష్ట్రపతి బస చేస్తారు. అలాగే దేశ రక్షణ దళానికి చెందిన ప్రముఖులు అంతా విశాఖలోనే ఉండడంతో కట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో విశాఖ ఇపుడు నిర్బంధం అయింది. విశాఖ సాగరతీరంతో పాటు ఆకాశం, నేల, అంతా కూడా నిఘా నీడలోకి వెళ్ళిపోయింది.
విశాఖలో ఏ మూల చూసినా పోలీస్ గస్తీతో పాటు ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కనురెప్ప కదల్చకుండా భద్రతా దళాలు గస్తీ కాస్తున్నాయి. రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ విశాఖలో మూడు రోజుల పాటు ఉండనున్నారు. దాంతో విశాఖ పరిసరాలు మొత్తం రక్షణ శాఖ నిఘాలోకి వెళ్లిపోయాయి.
ఇదిలా ఉండగా విశాఖ పరిసరాలు అన్నీ కూడా బలగాల గుప్పిటలోనే ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఈ ఆంక్షలు ఇబ్బందిగా ఉన్నా దేశ రక్షణ దృష్ట్యా ఇది తప్పనిసరి అవుతోంది. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ ముస్తాబైంది. ఈ యుద్ధ నౌక సమీక్ష 2006లో తొలిసారిగా విసాఖలో జరిగింది. నాడు అబ్దుల్ కలాం విశాఖ విచ్చేశారు. 2016లో రెండవసారి విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.
ఇక మూడవసారి ఈ నెల 21న జరుగుతున్న ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి యుద్ధ నౌకలో నౌకాదళ శక్తిసామర్ధ్యాలను సమీక్షిస్తారు. ఇక సబ్ మెరైన్లుల పాటు అత్యాధునిక రక్షణ సంపత్తిని రాష్ట్రపతి స్వయంగా చూస్తారు. ఇక ఈ నెల 27న మిలాన్ పేరిట అంతర్జాతీయ వేడుక జరగనుంది. ఇతరదేశాలతో పాటు భారత్ కలసి సంయుక్త నావికాదళ విన్యాసాలు విశాఖ సాగరతీరంలో జరుగుతాయి. విశాఖ బీచ్ రోడ్డులో అంతర్జాతీయ నగర కవాతు సాగుతుంది. ఇది మిలాన్ లో అతి ముఖ్య ఆకర్షణగా ఉంటుంది.
మిలాన్ కి 42 దేశాలకు చెందిన తొమ్మిది వేల మంది విదేశాలకు చెందిన వారు మిలాన్ లో పాలుపంచుకుంటారు. మొత్తానికి మార్చి 4 వరకూ సాగే మిలాన్ కోసం విశాఖ సాగరతీరం సర్వసన్నద్ధమైంది. మొత్తానికి చూస్తే విశాఖ ఇపుడు నావికాదళ విన్యాసాలతో అంతర్జాతీయ వేదికగా నిలిచింది.