Begin typing your search above and press return to search.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 2000 ఫైన్ ...ఆ కార్పొరేషన్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   19 May 2021 11:30 PM GMT
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 2000  ఫైన్ ...ఆ కార్పొరేషన్ కీలక నిర్ణయం !
X
కరోనా..కరోనా..ఈ మహమ్మారి జోరు సెకండ్ వేవ్ కో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. నిత్యం లక్షల సంఖ్య లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా చూస్తుంటే కరోనా కేసులు అయితే తగ్గుతూ వస్తున్నాయి. కానీ, కరోనా మరణాలు మాత్రం పెరుగుతూపోతున్నాయి. దీనితో దేశంలో ఆందోళన పెరిగిపోతుంది. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కట్టడి లో భాగంగా లాక్ డౌన్స్ , కర్ఫ్యూ లు అమలు చేస్తున్నారు. అయితే , నిత్యావసర సరుకులు కొనడానికి కొంత సమయం ఇస్తున్నారు. అయితే దాన్ని కూడా కొందరు మిస్ యుజ్ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం టైం కేటాయిస్తే , ఏ పని లేకపోయినా బయటకి వచ్చి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు.

ఇక కరోనా కట్టడి లో భాగంగా అమలు చేస్తున్న ఆంక్షల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కరోనా బాధితులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే రూ.2వేల ఫైన్ విధించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన కరోనా వైరస్ మహమ్మారి బాధితులు నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే వారికి రూ.2000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీచేసింది. ఇలా తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కరోనా కేర్ సెంటర్‌ కు తరలిస్తామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు చేశారు. మంగళవారం ఒక్కరోజే తమిళనాడులో 33,059 కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. 21,262 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 364 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,31,596కి పెరిగింది. కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కరోనా సెంటరును ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా వైరస్ తో మరణించిన ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు సీఎం ప్రకటించారు.