Begin typing your search above and press return to search.
భాగస్వామితో విడిపోయిన వారికి బంపర్ ఆఫర్
By: Tupaki Desk | 20 Feb 2017 3:30 PM GMTవిరహ వేదన అనేది కేవలం ప్రేమించుకున్నవారికే ఉండాలని లేదు కదా?! రకరకాల కారణాల వల్ల తమ భాగస్వామి నుంచి విడిపోయిన వారికి కూడా ఈ బాధ ఉంటుంది. అందులోనూ 35 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో జీవన సహచరి శాశ్వతంగా దూరమైతే ఆ ఆవేదన మనసును తొలిచి వేస్తుంటుంది. అయితే అలాంటి వారికోసం గొప్ప ఆఫర్ ఒకటి వచ్చింది. ఆఫర్ అంటే ఏదో రకంగా ఆలోచించకండి! పూర్తిగా సదరు వ్యక్తులకు సాంత్వన చేకూర్చే సందర్భంతో పాటు కొత్త భాగస్వామిని కుదిర్చేదన్నమాట. ఇంతకీ విషయం ఏమిటంటే...గుజరాత్ కు చెందిన ఓ సంస్థ ‘వినా ముల్యే అమూల్య సేవ’ పేరుతో 35 ఏళ్ల నుంచి ఆ పైన వయసు ఉండి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారు, భర్త చనిపోయినవారు, భార్య చనిపోయినవారి కోసం ఈ కొత్త స్కీమ్ తెచ్చింది.
భారతీ రావల్ అనే వ్యక్తి ఈ టూర్ వివరాలు వెల్లడించారు. మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్ అని వరించారు. షిమ్లా వంటి ఆహ్లాదకర వాతావరణంలో పది రోజుల పర్యటన ఉంటుంది. అలా అని భారీ చార్జీలు కాకుండా రూ.10 వేలల్లోనే హోటల్ ఖర్చు - ఆహారం - ఆయా ప్రాంతాల సందర్శన - లగ్జరీ బస్సులో ప్రయాణం వంటివి ఉంటాయి. మహిళలకు ట్రాన్స్ పోర్టేషన్ టారిఫ్స్ ఉండవట. కాగా, ఈ కొత్త ఆలోచనకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గుజరాత్ - బెంగళూరు - హైదరాబాద్ నుంచి కూడా పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారట. ఇద్దరు ఎన్నారైలు - ఓ 85 ఏళ్ల వ్యక్తి - 72 ఏళ్ల మహిళ కూడా ఉందని ఆయన తెలిపారు.
మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించే తమ ఆలోచన ద్వారా పది రోజుల్లో వారు అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. అంతేకాదు మానవత కోణంలో చూడాలని ఆయన కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/