Begin typing your search above and press return to search.

షాకింగ్.. ఆ గ్రామంలో నివసించాలంటే ఈ అవయవం తొలగించుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   17 Nov 2021 2:30 AM GMT
షాకింగ్.. ఆ గ్రామంలో నివసించాలంటే ఈ అవయవం తొలగించుకోవాల్సిందే!
X
ఇతర దేశాల్లో నివసించాలంటే సహజంగా కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని ఒప్పందాల ప్రకారం ఆ నిబంధనలను విధించుకుంటారు. పైగా వాటిని అమలు చేయడానికి కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కేటాయిస్తారు. కొన్ని పల్లెల్లోనూ నివసించడానికి ప్రత్యేక షరతులు వర్తిస్తాయి. ఇక కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అయితే ఆ ఆంక్షలు చెప్పలేనివి. పక్క పక్క గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఊరి సరిహద్దుల్లో ముళ్ల కంప, పెద్ద పెద్ద కర్రలు, రాళ్లు అడ్డుపెట్టారు. ఇక విదేశీ రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు అన్ని దేశాలు ఇతర దేశాల ప్రజలను తమ దేశంలోనికి అనుమతించలేదు. అయితే ఓ ఊరిలో మాత్రం వింత షరతులు అవలంభిస్తున్నారు. అయితే ఇది కరోనానో లేక ఇంకా ఏదైనా వచ్చినప్పుడు కాదు చాలాకాలంగా ఈ నిబంధన అమల్లో ఉంది. ఆ ఊరిలో ఎవరైనా నివసించాలంటే చాలు వారి శరీరంలోని ఈ అవయవాన్ని తొలగించుకోవాలి.

శరీరంలోని ఆ అవయవాన్ని తొలగించుకుంటేనే ఆ గ్రామంలో నివసించే హక్కు ఉందట. ఆ గ్రామంలో నివసించేవారందరూ కూడా దీనిని పాటిస్తారట. ఇక కొత్తవారు వెళ్లాలనుకున్నా కూడా కచ్చితంగా ఈ రూల్ పాటించాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? అంటార్కిటికా ఖండంలో ఉంది. నిజమే పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఆ ప్రాంతంలోని ఓ గ్రామంలోనే ఈ వింతైన ఆచారం ఉంది. అంటార్కిటికాలో జనం చాలా తక్కువగా ఉంటారు. కేవలం రెండు ప్రాంతాలు మాత్రమే జనావాసానికి అనుకూలం. అంతేకాదు ఆ ప్రాంతాల్లోనూ ఇలాంటి షరతులు వర్తిస్తాయి. అంటార్కిటికాలోని విల్లాలాస్ ఎస్ట్రెల్లాస్ గ్రామంలో నివసించాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే.

నిరంతరం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతంలో నివసించడం మామూలు విషయం కాదు. పైగా అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలగాలి. అయితే అక్కడ వైద్య సదుపాయాలు కూడా చాలా తక్కువ. చిన్న చిన్న వైద్య సేవలు అందిస్తారు. కానీ శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి అక్కడ సరైన సదుపాయాలు ఉండవు. అందుకే అక్కడ ఉండాలంటే కొన్ని షరతులు విధించుకున్నారు.   విల్లాలాస్ ఎస్ట్రెల్లాస్ గ్రామంలో ఉండాలంటే ముందుగానే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవాలి. శరీరంలోని ఉండూకాన్ని తొలగించుకోవాలి. ఈ శస్త్ర చికిత్స చేయించుకుంటేనే ఆ గ్రామంలో ఉండడానికి అర్హులు అని అక్కడి వారు చెబుతున్నారు.

జనావాసానికి అనువైన ప్రదేశం కాని అంటార్కిటికాలో నివసించాలంటే ఇలాంటి రూల్స్ చాలానే పాటించాలి. ఊరిలో ఉండడానికి శరీరంలోని అవయవం తొలగించుకోవాలనుకునే నిబంధన కాస్త ఆశ్చర్యానికి గురి చేయక మానదు. అయితే ఉండూకం వల్ల ఆ వాతావరణ పరిస్థితుల్లో ఇతర అరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే ఆ అవయవాన్ని తొలగించుకోవాలని షరతు విధించారు. అక్కడ ఉండాలని అనుకునేవారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఆస్పత్రుల్లో సర్జరీకి సరైన సదుపాయాలు ఉండవు. కాబట్టే ముందుగా ఈ ఉండూకాన్ని తొలగించుకోవాలనే నిబంధనను పాటిస్తున్నారు.