Begin typing your search above and press return to search.
వణికిపోతున్న తమిళనాడు గ్రామాలు
By: Tupaki Desk | 30 Aug 2022 5:00 AM GMTతమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఎందుకింతగా వణకుతున్నారంటే చీమల దండయాత్ర దెబ్బకు. చీమలకే ఎవరైనా వణికిపోతారా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చీమలు మామూలు చీమలు కావు 'ఎల్లో క్రేజీ యాంట్స్' అనే పేరున్న భయంకరమైన చీమలు. ఒక్కసారిగా లక్షలసంఖ్యలో ఈ చీమలు దిండుక్కల్ జిల్లాకు ఆనుకుని ఉన్న కరంత్తమలై రిజర్వుఫారెస్టు పరిధిలోని ఏడుగ్రామాలపై దండెత్తాయి.
లక్షలు, కోట్ల సంఖ్యలో గ్రామాలపై దండెత్తుతున్న చీమలు ఏది దొరికితే దాన్ని తినేస్తున్నాయి. ఈ చీమలు పంటలను నాశనం చేయటంతో ఆగకుండా పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్ళపైన కూడా దాడులు చేస్తున్నాయి. ఈ జంతువులపై ఒక్కసారిగా లక్షల సంఖ్యలో చీమలు దాడులు చేసి బాగా కుట్టేస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే చీమల కాటుకు జంతువులు చనిపోవటం లేదు.
వీటి నుండి వచ్చే స్రావాల కారణంగా జంతువుల చర్మంపై పెద్దపెద్ద దద్దుర్లు తయారై దురదలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న దురదలను తగ్గించుకోవటానికి పశువులు దేనికంటే దానికి రుద్దుకుంటున్నాయి.
దాంతో గాయాలవుతున్నాయి. ఆ గాయాలపై చీమలు మళ్ళీ దాడులు చేసి చంపి తినేస్తున్నాయి. పొలాల్లో మనుషులు ఏమరుపాటుగా ఉంటే వాళ్ళపైకి కూడా చీమలు పాకేస్తున్నాయి. దీనివల్ల మనుషుల్లో కూడా దద్దుర్లు, దురదలు మొదలవుతున్నాయి. చీమల దండయాత్ర కారణంగా మనుషుల జీవితాలు, రోజువారీ పనులు దుర్భరంగా తయారయ్యాయి.
ఇంట్లో ఉండాలన్నా భయమే బయటకు రావాలన్నా భయపడుతున్నారు. దాంతో చేసేదిలేక, చీమల దాడులను తట్టుకోలేక ఏడు గ్రామాల్లోని జనాలు ఇళ్ళను, ఊళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. పరిస్ధితులను గమనించిన కీలక శాస్త్రవేత్తలు వెంటనే దుండికల్ జిల్లాలోని గ్రామాల్లో పరిశోధనలు ప్రారంభించారు. తమకు అందుబాటులో ఉన్న చీమల మందులు వంటివి జనాలు చల్లుతున్నా ఎలాంటి ప్రయోజనం కనబడటం లేదు.
ఈ నేపధ్యంలోనే గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన ఘటనలను తమిళనాడులోని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అప్పుడెప్పుడో ఆస్ట్రేలియాలో కూడా చీమలదెబ్బకు జనాలు ఇలాగే ఇబ్బందులు పడ్డారట. అప్పుడు ప్రత్యేకమైన రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా పిచికారి చేయటం వల్ల 99 శాతం సమస్య పరిష్కారమైందట. మరిక్కడ ఏమి చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.