Begin typing your search above and press return to search.

బీయారెస్ బీజేపీ ఒక్కటేనా...రాములమ్మ ట్వీట్ కి వెనక...?

By:  Tupaki Desk   |   8 July 2023 9:04 PM GMT
బీయారెస్ బీజేపీ ఒక్కటేనా...రాములమ్మ ట్వీట్ కి వెనక...?
X
తెలంగాణా లో బీయారెస్ హ్యాట్రిక్ కొట్టాల ని చూస్తోంది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ సాగుతోంది. అదే శ్రీ రామరక్ష అన్నట్లుగా బీయారెస్ భావిస్తోంది. ఈ నేపధ్యం లో చూస్తే బీయారెస్ బీజేపీ ఒక్కటి అని ఎందుకు అంటారు అని బీజేపీ వారు అంటున్నారు. ఇక బీజేపీ లో ఉన్న ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపీ విజయశాంతి అయితే ఈ రోజు చేసిన ట్వీట్ అయితే చాలా అర్ధాలనే చెబుతోంది.

ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏంటి అంటే బీఆరెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? బట్ట కాల్చి బీజేపీ మీదేసి దెబ్బ తీస్తాం... వదిలించుకొని బయట పడాల్సింది బీజేపీయే అనే దుర్మార్గాన్ని తన అనుకూల మీడియా ద్వారా కేసిఆర్ గారు ప్రచారం చేయిస్తున్నరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి ఎక్కువ సీట్లు వస్తే బీఆరెస్‌ కి నష్టం...అంటూ సాగింది.

దాని కంటే ముందు మరో ట్వీట్ కూడా ఆమె చేశారు. ఒకవైపు మళ్లీ అధికారం తమదేనని చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆరెస్ అధిపతికి ఈ వంచనలెందుకు? గెలుపు పై అంత ధీమా ఉన్నప్పుడు ఈ మోసాలెందుకు? అని ప్రశ్నించారు.

ఇలా విజయశాంతి ట్వీట్లతో సమరం సాగుతోంది. కానీ అసలు బీజేపీ ఈ మధ్య చేసిన కసరత్తు ఏంటి అన్నది కూడా బీజేపీ వ్యతిరేకుల లో ఉన్న భావన. కేవలం బీయారెస్ కి ఫీవర్ కోసమే తెలంగాణా లో అధ్యక్ష పదవుల లో మార్పు చేర్పులు చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.

నిజానికి బీయారెస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ గా ఉన్న కవిత ను బీజేపీ పెద్దలు అరెస్ట్ చేయకపోవడం వెనక మతలబు ఏంటి అన్న చర్చ కూడా వస్తోంది. ఆ అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంకేతం వెళ్తోంది అని అంటున్నారు. ఇక బీజేపీ ప్రెసిడెంట్ గా నిన్నటి దాకా ఉన్న బండి సంజయ్ ని మార్చడం బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అనీ అంటున్న వారూ ఉన్నారు ఈ పరిణామల నేపధ్యం లోనే కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం తెలంగాణా లో పెరుగుతుందని, అదే విధంగా బీజేపీ తగ్గుతున్నదనే ప్రచారాన్ని బీజేపీ వ్యతిరేకులు చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినా బీయారెస్ కి మేలు అని చెప్పడమే ఆ పార్టీ ఎత్తుగడ అన్నది కూడా ఎదురవుతున్న ప్రశ్నలు. ఇక 2018లో జరిగినట్లుగానే 2023లో జరగాల ని కేసీయార్ కోరుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఓట్లు చీలికతో పాటు తెలంగాణా వాదం కూడా బలంగా వినిపిస్తే ఆ సెంటిమెంట్ తో మూడవసారి అధికారం లోకి రావడమే లక్ష్యంగా చేసుకోవాల ని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఇంకో వైపు నుంచి చూస్తే అట్లయితే, కవిత అరెస్టు అందరికన్నా అత్యంత అవసరం కేసిఆర్ కే కదా మరి బీఆర్ఎస్ అందుకోసం డిమాండ్ చేస్తదా? ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు లో సీబీఐ విచారణ జరిగినప్పుడు అంత ఆత్రంగా కవిత తో పాటు మందీ మార్బలాన్ని ఢిల్లీ పంపడం సానుభూతి కోసం ఆడిన డ్రామానా? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఏది ఏమైనా మోడీ వరంగల్ వచ్చి భారీ మీటింగ్ పెట్టి కేసీయార్ ని ఎన్ని అన్నా కూడా ఎఫెక్ట్ లేదని అంటున్నారు. దానికి కారణం ఇలాంటివే. కవిత ను అరెస్ట్ చేయకుండా అవినీతి అని ఎంత చెప్పినా జనాలు నమ్మరే అన్న మాట వస్తోంది. చూడాలి మరి మేము బీయారెస్ తో దోస్తు పెట్టుకుంటామా అని హూంకరించడం కాదు ఆ విధంగా తమ మీద అనుమానాలు రాకుండా చూసుకోవాల్సి ఉంది.

ఇక బీయారెస్ అధినేత కూడా తిమ్మిని బమ్మిని చేసే రకం. ఆయన కు ఇలాంటివి చాలు అల్లుకుని పోవడానికి. మొత్తానికి బీయారెస్ బదనాం అవుతోందా లేక చేస్తున్నారా అన్నది ఒక ప్రశ్న అయితే కాంగ్రెస్ పెరిగినా బీజేపీ పెరిగినా అంతిమంగా బీయారెస్ కే లాభమా అన్న పాయింటు లో లాజిక్ ఎంత ఉందో చూడాల్సి ఉంది అంటున్నారు.