Begin typing your search above and press return to search.
విజయసాయిరెడ్డి నుంచి ఇలాంటి ట్వీటా?
By: Tupaki Desk | 20 April 2023 1:40 PM GMT''టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా''.. ఇది ఒక రాజకీయ నాయకుడు వేసిన ట్వీట్. ఈ కంటెంట్ చూశాక ఏ టీడీపీ నాయకుడో, లేదా ఆ పార్టీకి మద్దతుగా వేరే పార్టీ నేత ఎవరో ఈ ట్వీట్ వేసి ఉంటారనే అనుకుంటాం.
కానీ వైసీపీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి ఇలాంటి ట్వీట్ వేశారంటే నమ్మశక్యంగా అనిపించదు. రాజకీయ నాయకుల పుట్టిన రోజులు వచ్చినపుడు.. వైరి పక్షంల నేతలు మర్యాదపూర్వకంగా ఇలా ట్వీట్లు వేయడం మామూలే. కానీ విజయసాయిరెడ్డి నైజం.. కొన్నేళ్ల నుంచి ఆయన వేస్తున్న ట్వీట్లు చూశాక మాత్రం ఇది ఆయన హ్యాండిల్ నుంచి పడ్డ ట్వీట్ అంటే జనాలు ఆశ్చర్యపోతారు.
చంద్రబాబు పుట్టిన రోజుల్లాంటి సందర్భాల్లో కూడా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలతో ట్వీట్లు వేసిన చరిత్ర విజయసాయిది. ఐతే వైసీపీలో ఒకప్పుడు వైభవం చూసిన విజయసాయికి ఏడాది కిందట్నుంచి ఆ పార్టీలో ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి టీడీపీని టార్గెట్ చేయడం కూడా తగ్గించేశారు.
ఒకప్పట్లా బూతులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆ హ్యాండిల్లో కనిపించట్లేదు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యురాలైన అలేఖ్య రెడ్డి భర్త తారకరత్న మరణించిన దగ్గర్నుంచి ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది.
ఆ టైంలో చంద్రబాబు, బాలయ్యలతో సన్నిహితంగా మెలగడమే కాక.. వారి గురించి సానుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఒకప్పుడు విజయసాయి హ్యాండిల్ నుంచి వచ్చిన దారుణాతి దారుణమైన ట్వీట్లు చూసి.. ఇప్పుడు పడ్డ ట్వీట్‌తో వాటిని పోల్చుకుని మీరు మారిపోయారు సార్ అంటూ టీడీపీ వాళ్లు ఆయన గురించి సానుకూలంగా స్పందిస్తున్నారు.