Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలపై సాయిరెడ్డి సెటైర్లు… ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న అంట!

By:  Tupaki Desk   |   12 Jun 2023 4:00 PM GMT
బీజేపీ నేతలపై సాయిరెడ్డి సెటైర్లు… ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న అంట!
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకూ జగన్ సర్కార్ కి ఆర్ధికంగా సహకరిస్తున్నట్లు కనిపించిన బీజేపీ పెద్దలు తాజాగా రివర్స్ లో ఫైరయ్యారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా విజయసాయిరెడ్డి సెటైరికల్ గా స్పందించారు.

తాజాగా ఏపీలో పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా.. వైసీపీ సర్కార్ పై చేసిన మాటల దాడిపై ఎదురుదాడి ప్రారంభమైపోయింది. ఈ మేరకు వైసీపీ నేతలు బీజేపీ పెద్దలపై వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు.

ఇందులో ఒకరు క్లాస్ వార్నింగ్స్ ఇస్తూ సేటైర్స్ వేస్తుంటే.. మరి కొందరు మాస్ వార్నింగ్స్ ఇస్తూ ఘాటైన కౌటర్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మైకందుకున్న విజయసాయిరెడ్డి సెటైర్స్ వేశారు.

అవును... బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై చేసిన ఆరోపణలపై తాజాగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో బీజేపీకి చోటు లేదని.. ఆ పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రచారం చేసుకోవడం ఏపీ బీజేపీ నేతలు కష్టతరమైపోయిందని, అందుకోసమే ఢిల్లీ నుంచి నేతలను రప్పించుకుంటోన్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఏపీలో ఎక్కడికి వెళ్లినా... "రాష్ట్రానికి కేటాయించాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల" గురించి రాష్ట్రప్రజలు వారిని నిలదీస్తోన్నారని సాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలంటూ బీజేపీ నేతలు చేసిన ప్రతిపాదనలపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలిపారు.