Begin typing your search above and press return to search.
జైళ్లు కొత్తకాదు.. విజయమ్మ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 25 April 2023 2:45 PM GMTజైళ్లు తమకు కొత్తకాదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాతృమూర్తి విజయమ్మ అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిల మళ్లీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు. కేసులు, అరెస్టులకు ఆమె భయపడదని స్పష్టం చేశారు. షర్మిల ఒంటరిగానే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని చెప్పారు. ప్రశ్నించే గొంతుకను తెలంగాణ ప్రభుత్వం నొక్కుతోందని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెబుతున్నందుకే అరెస్టు చేశారని విమర్శించారు. అన్ని పార్టీల సభలకు అనుమతిచ్చి షర్మిలను అడ్డుకుంటున్నారని విజయమ్మ దుయ్యబట్టారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరా డుతుందని చెప్పారు. గ్రూప్ పరీక్షలు, పదోతరగతి పరీక్ష పేపర్ అసలు ఎలా లీక్ అవుతాయని ప్రశ్నించారు. లీకులను ప్రశ్నించడం.. తప్పా? అని నిలదీశారు. ప్రజల పక్షాన మా పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలు ప్రశ్నించేలా ప్రభుత్వం నడుచుకోకూడదని వైఎస్ విజయమ్మ హితవు పలికారు. చంచల్ గూడ జైలులో ఉన్న షర్మిలను పరామర్శించిన అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం అడుకుంటోందన్నారు. ఈరోజు జైల్లో పెట్టి గొంతు నొక్కేయవచ్చు కానీ షర్మిల మీ మధ్యకి వచ్చి మళ్ళీ పోరాడుతుందని విజయమ్మ అన్నారు.
ఇలాంటి నిర్బంధాలకు షర్మిల భయపడదని చెప్పారు. షర్మిల ఏమైనా ఉద్యమకారిణా? టెర్రరిస్టా? అని ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్స్ కి పర్మిషన్ ఇస్తున్నారని... షర్మిల సభలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని సర్కారును నిలదీశారు.