Begin typing your search above and press return to search.

విజ‌య శిఖ‌రాల‌కు చేరండి - తుపాకి.కాం

By:  Tupaki Desk   |   18 Oct 2018 3:21 AM GMT
విజ‌య శిఖ‌రాల‌కు చేరండి - తుపాకి.కాం
X
ద‌స‌రా ... చెడుపై మంచి గెలిచిన రోజు
ద‌శ హ‌రుడైన రావ‌ణుడిని... రాముడు చంపిన రోజు
మ‌హిషాసురుడిని దుర్గ‌మ్మ హ‌త‌మార్చిన రోజు...
పాండ‌వులు అజ్ఞాత‌వాసంతో స‌హా పూర్తి చేసిన రోజు...
అంటే... విజ‌యాల ద‌స‌రా... మీరు ఉత్త‌మ నిర్ణ‌యాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డానికి ఇంత‌కుమించిన ముహుర్తం ఏముంటుంది?

ద‌స‌రా పండ‌గకు ఉన్న‌న్ని విశిష్ట‌త‌లు ఇత‌ర ఏ పండుగ‌కు లేవు. మిగ‌తా పండ‌గ‌లు మాన‌వులు మాత్ర‌మే జ‌రుపుకుంటారు. కానీ విజయదశమిని దేవతలూ - మాన‌వులూ జరుపుకొన్నారు. అందుకే ఈ పండుగ‌కు అంత విశిష్ట‌త‌. దుర్గామాత వెంటాడి చంపిన రాక్ష‌సులు - రావ‌ణుడు కూల్చేసిన ప‌ది త‌ల‌లు ఇప్పుడు మ‌న‌లోని దుర్గుణాలే. వాట‌న్నింటినీ చంపేసి మీరు మంచి మ‌న‌సుతో కొత్త ప‌నికి శ్రీ‌కారం చుట్టి విజ‌య తీరాల‌కు చేరాల‌ని సూచించే రోజే ద‌స‌రా. భార‌తీయ పురాణాల ప్ర‌కారం... ముహుర్తాలు మూడు విష‌యాల‌ను చూసి పెడ‌తారు. న‌క్ష‌త్రం.. తిథి... స‌మ‌యం. ఎంత మంచి న‌క్ష‌త్రం ఉన్నా తిథి బాలేక‌పోతే ముహుర్తం పెట్ట‌రు. అందుకే తిథుల‌కు అంత ప్రాధాన్యం. మ‌న‌కు ఉన్న ప‌దిహేను తిథుల్లో ద‌శ‌మి - ఏకాద‌శి అత్యుత్త‌మ‌మైన తిథులు. అలాంటి ద‌శ‌మి తిథి రోజునే వ‌స్తుంది ద‌స‌రా. మ‌న‌లోని దుర్గుణాల‌న్నీ చంపేసి ఆ దుర్గామాత‌ను పూజించి ఈరోజు ఏ ప‌నికి శ్రీ‌కారం చుట్టినా, స‌దుద్దేశంతో ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగినా విజ‌యం సిద్ధించడం త‌థ్యం.

జీవితంలో స‌ర‌దాలు నింపే విజ‌యాల‌కు శ్రీ‌కారం చుట్టే ఈ ద‌స‌రా... ద‌శ‌దిశ‌లా విస్త‌రించిన ప్ర‌తి తెలుగు వాడి జీవితంలో చీక‌ట్లు పార‌దోలి మ‌రిన్ని విజ‌యాలు నింపాల‌ని తుపాకి యాజ‌మాన్యం మ‌నఃపూర్వ‌కంగా కోరుకుంటూ మీ అంద‌రికీ ద‌స‌రా శుభ‌కాంక్ష‌లు చెబుతోంది. క‌ష్టం ఊరికే పోదు... నైపుణ్యం వృథా కాదు... ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగి దుర్గామాత ఆశీస్సులతో మ‌రిన్ని విజ‌యాలు సాధించి సంతోషంగా ఉండండి. అంద‌రికీ సంతోషాలు పంచండి.