Begin typing your search above and press return to search.

పవన్ వారాహి రధమెక్కి వస్తే ఆ కిక్కే వేరబ్బా !

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
పవన్ వారాహి రధమెక్కి వస్తే ఆ కిక్కే వేరబ్బా !
X
ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు పదిహేను నెలల వ్యవధిలో ఉండగానే యాత్రలు స్టార్ట్ అవుతున్నాయి. తెలుగుదేశం భావి నాయకుడు నారా లోకేష్ బాబు తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను టార్గెట్ గా పెట్టుకుని లోకేష్ బాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహం నింపుతోంది.

ఇక చంద్రబాబు తన జిల్లా టూర్లను యధావిధిగా కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఈ నెల మూడవ వారంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఈ టూర్లను మొదలెడతారు అని అంటున్నారు. ఇక ఇపుడు అందరి దృష్టి జనసేనాని పవన్ కళ్యాణ్ మీదనే ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు నెలల క్రితం బస్సు యాత్ర గురించి ప్రకటించారు. ఆ తరువాత వారాహీ వాహనాన్ని ఆయన కొనుగోలు చేశారు.

ఆ వాహనం ద్వారా ఏపీ మొత్తం చుట్టాలని ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారు. వారాహీకి గత నెలలో పూజలు కూడా నిర్వహించారు. ఇవన్నీ బాగా ఉన్నా వారాహి ద్వారా పవన్ ఎపుడు తన యాత్ర స్టార్ట్ చేస్తారు అన్నది జనసైనికులలో ఉన్న ప్రశ్న. తెలుగుదేశానికి ఉత్సాహంగా నారా లోకేష్ పాదయాత్ర ఉంది. జనసైనికుల కోసం పవన్ వారాహి యాత్ర చేయాలని కోరుతున్నారు. ఏపీలో ఎన్నికలకు వ్యవధి పెద్దగా లేకపోవడం వల్ల పవన్ ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని అంటున్నారు.

అయితే పవన్ మాత్రం వరసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన వారాహి వాహనం ఎక్కేది ఎపుడు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఇదిలా ఉండగా పవన్ వారాహీని పట్టాలెక్కించేది కొద్ది నెలల తరువాత నుంచి అని అంటున్నారు. ఏపీలో మొత్తం వారాహి యాత్ర ఉంటుందా అంటే కొన్ని ఎంపిక చేసిన జిల్లాలలో పూర్తిగానూ మరి కొన్ని చోట్ల పరిమితంగానూ వారాహి యాత్ర ఉంటుంది అని ప్రచారం సాగుతోంది. వారాహి వాహనం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో పూర్తిగా కదం తొక్కుతుందని అంటున్నారు.

ఇక్కడ పవన్ పార్టీకి మంచి బేస్ ఉంది. దాంతో ఇక్కడ టూర్ చేయడం ద్వారా మొత్తం జనసేనకు పాజిటివీని కలిగించాలని చూస్తున్నారు. అదే రాయలసీమ జిల్లాలలో అయితే ఎంపిక చేసిన ప్రాంతాలలో వారాహీ టూర్ ఉంటుందని చెబుతున్నారు. ఈ విధంగా విభజించుకుని వారాహి తన యాత్ర చేపట్టడానికి అనుకున్న సమయం సరిపోతుంది అని అంటున్నారు.

అందుకే పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను సాధ్యమైనంత తొందరలో కంప్లీట్ చేసి ఈ ఏడాది రెండవ భాగం నుంచి పూర్తి స్థాయిలో వారాహి రధమెక్కుతారని అంటున్నారు. ఒకసారి కనుక వారాహి వాహనాన్ని పవన్ అధిరోహించినట్లు అయితే వెనక్కి మళ్ళీ చాన్సే లేదని అంటున్నారు. ఇక ఎన్నికలు వచ్చేంతవరకూ అలా జనంలోనే ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకునే ఆయన రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.

మొత్తానికి మరి కొద్ది నెలల పాటు వారాహి వాహనం కోసం జనసేన జనాలతో పాటు సాధారణ జనాలు కూడా ఎదురుచూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో పవన్ వారాహి రధకెమెక్కి వస్తే వచ్చే ఆ పొలిటికల్ కిక్కే వేరు అని అంటున్నారు. ఆ కిక్కి తోనేనే ఏపీ పాలిటిక్స్ హీటెక్కిపోతాయని కూడా అంచనా కడుతున్నారు. ఈసారి ఏపీ పాలిటిక్స్ కి ఎన్నికలకు టాప్ అట్రాక్షన్ పవర్ స్టారే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.