Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న 'టచ్' గోల

By:  Tupaki Desk   |   10 April 2023 10:53 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న టచ్ గోల
X
తెలుగురాష్ట్రాల్లో టచ్ గోల పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు తనతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని వాళ్ళకు అర్ధమైపోయిందట. అందుకనే బీజేపీలో కి వస్తే టికెట్ ఖాయమని హామీ ఇస్తే వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతామని అడుగుతున్నట్లు బండి చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజముందో కాలమే తేల్చాలి.

సరిగ్గా ఇలాంటి మాటలనే ఏపీలో చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేష్ అండ్ కో పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షపార్టీల్లోకి వెళ్ళటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. నిజంగానే వైసీపీని వదిలేసి టీడీపీలో చేరటానికి ఎంఎల్ఏలు రెడీగా ఉంటే వెంటనే వాళ్ళకి టికెట్ల హామీ ఇచ్చేసి చేర్చుకోవచ్చు. పైగా 50 మంది వైసీపీ ఎంఎల్ఏలు టికెట్ల హామీ ఇస్తే టీడీపీలో చేరటానికి రెడీగా ఉన్నారని చంద్రబాబే చెప్పారు.

పార్టీ అధినేతతోనే అంతమంది ఎంఎల్ఏలు టచ్ లో ఉంటే మరి టికెట్ల హామీ ఇచ్చి వాళ్ళని చేర్చుకోవటంలో ఎందుకు వెనకాడుతున్నట్లు ? అంతమందిని వైసీపీ నుండి లాగేసుకుని జగన్ మానసిక స్ధైర్యాన్ని చంద్రబాబు దెబ్బకొట్టచ్చు. ఇపుడు తెలంగాణాకు సంబంధించి బండి కూడా ఇలాగే చెప్పారు. ఎలాగూ రాబోయేది తమ ప్రభుత్వమే అని బండి చెబుతున్నారు కాబట్టి చక్కగా అధికార పార్టీ ఎంఎల్ఏలను చేర్చుకోవచ్చు. అప్పుడు జనాల్లో కూడా బీజేపీ అంటే నమ్మకం పెరిగిపోతోంది.

అధికార పార్టీ నుండే ఎంఎల్ఏలు వచ్చేసి ప్రతిపక్షంలోని బీజేపీలో చేరుతున్నారంటే జనాల్లో మంచి ఇమేజి పెరుగుతుంది కదా. 119 నియోజకవర్గాల్లో ఎలాగూ బీజేపీకి అన్నీచోట్లా గట్టి అభ్యర్థులు లేరు. కాబ్టటి బీఆర్ఎస్ నుండి వచ్చే మంత్రులు, ఎంఎల్ఏలతో అభ్యర్ధుల కొరతను బండి అధిగమించవచ్చు. అవకాశముంటే ఎంతవీలైతే అంతమందిని లాగేస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందేమో కూడా. అప్పుడు బీజేపీకి మరింత హ్యాపీ కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.