Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో పెద్ద వికెట్ పడబోతోందా.?

By:  Tupaki Desk   |   30 Sep 2018 11:40 AM GMT
టీఆర్ ఎస్ లో పెద్ద వికెట్ పడబోతోందా.?
X
ముందస్తు ఎన్నికల వేళ టీఆర్ ఎస్ కు మరో భారీ షాక్ తగులబోతోందా.? ఆ పార్టీకి చెందిన ఓ పెద్ద వికెట్ పడబోతోందా.? ఒక ముఖ్య నేత కారు దిగబోతున్నారా.? ఆ ఎస్సీ లీడర్ జంప్ చేయబోతున్నారా.? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికల సమరోత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీని నమ్మి టికెట్ దక్కకపోవడంతో పలువురు ఇతర పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ జంపింగ్ ల వ్యవహారం టీఆర్ ఎస్ పార్టీకి కాస్త కాస్తగా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొండా సురేఖ దంపతులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కాంగ్రెస్ కు జై కొట్టారు. సీనియర్ నేత డీఎస్ కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఆయన్ను వదిలించుకునేందుకే టీఆర్ ఎస్ పార్టీ పావులు కదుపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్ త్వరలోనే టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత కాంగ్రెస్ లో చేరబోతున్నారని టీఆర్ ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలో కూడా నంబర్ 2 పదవిలో ఉండే ఆ లీడర్ జంపింగ్ చేయబోతున్నారనే వార్త టీఆర్ ఎస్ లో కలకలం రేపుతోంది.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ముఖ్యమైన నేతల్లో ఒకరుగా పేరు పొందారు. ఇటీవల టికెట్ ఆశించగా ఆయనకు - ఆయన కూతురుకు టికెట్ ఇవ్వకుండా సిట్టింగ్ కే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సీటు ఇచ్చాడు. దీంతో అలిగి పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. ఇది తెలిసినా కేసీఆర్ ఇంతవరకూ బుజ్జగింపులు కానీ - పిలిచి మాట్లాడడం కానీ చేయలేదట.. మరి ఈ టీఆర్ ఎస్ బడా నేత కారు దిగి హస్తం గూటికి చేరుతాడా లేదా అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది.