Begin typing your search above and press return to search.
ఆరు దేశాలతో సంబంధం.. టైటాన్ మునక కథను 'తేల్చేదెవరో?'
By: Tupaki Desk | 25 Jun 2023 12:17 PM GMTఅట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిన టైటానిక్ మహా నౌక శకలాలను చూసేందుకు అదే పేరుకు దగ్గరగా ఉన్న పేరు పెట్టుకున్న జలాంతర్గామి టైటాన్ లో బయల్దేరిన ఐదుగురి విషాదాంతంపై దర్యాప్తును తేల్చేదెవరో తేలాల్సి ఉంది. టైటాన్ పేరు దగ్గర నుంచి టైటానిక్ ప్రమాదంలో చనిపోయిన దంపతుల మనవరాలి భర్త కంపెనీ కావడం సహా ఎన్నో విశేషాలు ఈ ప్రమాద ప్రయాణంలో ఉన్నాయి.
అమెరికా, కెనడా అధికారులు ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తులో ఉన్నారు. అయితే ప్రమాదాన్ని ఎవరు నిగ్గు తేల్చాలన్నది ప్రశ్న. భద్రతా సంస్థలు.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు కొనసాగిస్తున్నందున వాస్తవానికి లాంఛనంగా ఇంకా దర్యాప్తు ప్రారంభం కాలేదు.
వాస్తవానికి ఈ టైటాన్ బయల్దేరింది కెనడా సముద్ర జలాల నుంచి. కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ అమెరికన్. అయితే, అతడి కంపెనీ ఓషన్ గేట్ రిజిస్టర్ అయినది బహమాస్ లో. రష్ తో పాటు ఇందులో ప్రయాణించిన నలుగురిలో పాకిస్థాన్ సంతతికి చెందిన కుబేరుడు షెహజాదా, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. మరో పైలట్ ఫ్రాన్స్ దేశస్తుడు. ఇంకొకరు బ్రిటన్ కు చెంది యూఏఈలో ఉంటున్న సాహసికుడు హమీష్ హర్డింగ్. ఓషన్‌గేట్ కంపెనీకి అమెరికా కేంద్రం. టైటాన్‌ను సముద్రంలోకి వదిలిన పోలార్ ప్రిన్స్ నౌక కెనడాకు చెందినది. దీంతోనే దర్యాప్తు విషయంలో అయోమయం నెలకొంది.
అయితే, అమెరికా కోస్ట్ గార్డ్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నది. ఆ దేశ జాతీయ రవాణా భద్రతా సంస్థ కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. టైటాన్ శకలాలు 3,810 మీటర్ల లోతులో కనిపించాయని ఉన్నాయి. ఇక దర్యాప్తులో అనేక దేశాలు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. అందుకు నాయకత్వం ఎవరిదో తేలని పరిస్థితి. మరోవైపు వాతావరణ అననుకూలత కారణంగా.. సముద్రగర్భంలో జరిగే దర్యాప్తులు వ్యయప్రయాసలతో, సుదీర్ఘ సమయం పట్టేవి. విచిత్రమేమంటే.. సముద్రంలో పరిశోధనలపై కంటే.. రోదసిలోకి మానవసహిత యాత్రలు నిర్వహించే
సంస్థలపైనే ఎక్కువ పర్యవేక్షణ ఉండడం.
అసలు అది జలాంతర్గామేనా?
టైటాన్ ను చూస్తుంటే ఇది అసలు జలాంతర్గామేనా? అన్న అనుమానం రాక మానదు. దాని డిజైన్ అలా ఉంది మరి. దీనిపై స్వతంత్ర తనిఖీకి ఓషన్ గేట్ సంస్థ నిరాకరించింది. ప్రమాదం వెనుక డిజైనే కారణమా? అన్న ప్రశ్న వస్తోంది. అంతర్జాతీయ సంస్థలు లేదా అమెరికా వద్ద కూడా టైటాన్ ను నమోదు చేయలేదు. నౌకా నిర్మాణం వంటి అంశాల్లో ప్రమాణాలు నిర్దేశించే సంస్థలు కూడా
నిర్దిష్టంగా పరిశీలించలేదు. ఇదంతా అనవసర ప్రయాస అనేది స్టాక్టన్ రష్ అభిప్రాయం. ఇక అత్యంత దారుణంగా జరిగిన ప్రమాదంపై న్యాయస్థానాల్లో కేసులు పడే చాన్సుంది. కానీ, మరణించినవారంతా ధనికులే. కేసులు వేసినవారికి దీనికితో ప్రయోజనం ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి.
కొసమెరుపు... : కెనడా, అమెరికా, పాకిస్థాన్, బహమాస్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా ఆరు దేశాలతో సంబంధం ఉన్నది టైటాన్ వ్యవహారం.. అసలు కోర్టులో కేసు వేస్తే దాని పరిధి ఏమిటో చెప్పలేని సందిగ్ధత. కానీ.. గమనార్హమేమంటే సముద్రంలో ప్రమాదం జరిగిన ప్రదేశం ఏ దేశానికీ చెందని ప్రాంతం.