Begin typing your search above and press return to search.
‘తిరుపతి’పై అప్పుడే మొదలైన రాజకీయ వేడి..
By: Tupaki Desk | 6 Feb 2021 7:45 AM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయం విరామం లేనట్లే కనిపిస్తుంది. అక్కడి పరిస్థితులను చూస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి నిత్యం రాజకీయంగా కొంచెం గట్టి పోటీనిచ్చేలానే పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రతిపక్షాలు అనేక రకాలుగా ప్రభుత్వానికి ఉచ్చులు బిగిస్తున్నాయి.కానీ వాటికి ఏమాత్రం జంకకుండా జగన్ ప్రభుత్వం తెంపేసుకుంటూ వస్తున్నారు. అనుకోని కొన్ని పరిస్థితులను ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని ప్రభుత్వంపై తిరగబడుతున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సుడిగాలిలా గెలిచిందని, ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్లీ గెలవరని టీడీపీ లాంటి వారు అప్పుడప్పుడు చురకలు వేస్తున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ వాళ్లు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే తిరుపతిలో గెలిచి మీ ప్రతాపం చూపించాలని సైకిల్ పార్టీకి సవాల్ విసురుతున్నారు.
మరో రెండు నెలల్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనలో ఇక్కడ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి రెడీగా ఉంది. టీడీపీ సైతం పనబాక లక్ష్మీ పేరును ఖరారు చేసింది. బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ వారు పోటీ చేస్తారో సస్పెన్స్ గానే ఉంది. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారు.
ఇటీవల రాష్ట్రంలో కొన్ని సంఘటనల ఆధారంగా రాజకీయ వేడి సంతరించుకుంది. అంతర్వేది ఘటన నుంచి రామతీర్థం వరకు ప్రభుత్వాన్ని ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలు రోజుకోరకంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ ఘటనల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ లీడర్ సోము వీర్రాజులు ఏకంగా రామతీర్థం వెళ్లి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు.
తిరుపతిలో జరిగే ఉప ఎన్నికకు ఈ ఘటనలతో దెబ్బ పడుతుందని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. ముఖ్యంగా అధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతిలో వైసీపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుందని అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అంత సీన్ లేదంటున్నారు. ఏరోజు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షాలు నమ్మే స్థితిలో లేరని.. అలా అయితే ఆ పార్టీలోని నాయకులు ఎందుకు వలసవెళ్తున్నారని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఏరకంగా చూసిన వైసీపీకే మొగ్గు ఉండే అవకాశం ఉంది. కానీ హిందుత్వంపై జరుగుతన్న దాడిని ఆసరాగా చేసుకొని టీడీపీ, బీజేపీలు ప్రచారం చేయనున్నారు. కానీ ప్రజలు ఇలాంటివి కాకుండా అభివ్రుద్ధిని నమ్ముతారని, అందువల్ల వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వైసీపీ గెలిచి టీడీపీ కనుక ఓడిపోతే ఇక మళ్లీ అసెంబ్లీ వరకు సైకిల్ పార్టీని నమ్మడం లేదని అర్థమవుతుందని ఫ్యాన్ పార్టీ వర్గం అంటోంది.