Begin typing your search above and press return to search.

శృంగారానికి టైం టేబుల్: ఎలా పెట్టుకోవాలంటే..?

By:  Tupaki Desk   |   15 Feb 2021 4:45 AM GMT
శృంగారానికి టైం టేబుల్: ఎలా పెట్టుకోవాలంటే..?
X
మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు.. కానీ కొన్ని పద్దతులు కూడా మారడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.. మనం ఎన్ని పద్ధతులు మార్చుకున్నా.. శృంగారం విషయంలో ఒక క్రమపద్ధతిని పాటిస్తే బంధాలు శాశ్వతంగా కొనసాగుతాయి. లేదంటే భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించడానికే సమయం సరిపోతుంది. శృంగారం నిర్వహించడానికి టైం ఎక్కడుంటుంది..?’ అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శృంగారానికి కూడా ఓ టైం పెట్టుకుంటే బాగుంటుందంటున్నారు కొందరు వైద్య నిపుణులు.. శృంగారానికి టైం ఏంటి..? అని అశ్చర్యపోకండి.. అదెలానో చూద్దాం..

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మనుషులంతా ఏదో ఒక పనిలో నిమగ్నమవుతున్నారు. దీంతో అప్పటి వరకు అలిసిపోయి నిద్రకు ఉపక్రమించడంతో భాగస్వామి బాధలో మునుగుతోంది. దీంతో వారి మధ్య ఉన్న ప్రేమ బంధంలో లోపం ఏర్పడుతుంది. మరి ఈ సమస్యకు నివారణ ఏం చేయాలి..? రోజూ వారీ కార్యక్రమాలు చేయకపోతే ఎలా..? అనే ప్రశ్న కూడా రావచ్చు. అయితే శృంగారానిక ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి.

మనకు ఎన్ని పనులున్నా ఓ గంట మాత్రం శృంగారానికి టైం కేటాయించండి.. అది రోజూ ఐనా సరే.. రెండు రోజులకు ఒకసారి అయినా సరే.. ఈ విషయం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. లేదా మీ భాగస్వామినే టైం చెప్పమనండి.. ఆ సమయం వచ్చే సరికి ఎన్ని పనులున్నా వాటిని పక్కన బెట్టండి.. మీరు కేటాయించిన సమయం రాగానే మీ భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు చేయండి..

అయితే మనకు కేటాయించిన టైంలో శృంగారం చేయగలమా..? అనే డౌట్ రాకమానదు. మనం భోజనానికి టైం కేటాయించుకుంటాం.. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలు అనుకుంది. ఆ టైం వచ్చేసరికి అనుకోకుండానే ఆకలి వేస్తుంది. అలాగే రాత్రి 9 గంటలు కాగానే మనం ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. అలాగే మనం శృంగారం విషయంలో టైంటేబుల్ మెయింటేన్ చేస్తే ఆ సమయం వచ్చేసరికి మనకు ఫీలింగ్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా భాగస్వామి సైతం ఈ టైం వచ్చేసరికి మీకు సహకరించడంతే శృంగారంలో అమితంగా ఆనందం పొందుతారు.