Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి ఇంట్లో వైరస్ కలకలం !
By: Tupaki Desk | 1 Jun 2020 5:00 AM GMTఏపీలో వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. తాజాగా మంత్రి ఇంట్లో వైరస్ కలకలం సృష్టించింది. మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో వైరస్ కలకలం చెలరేగింది. శంకర్ నారాయణ కుటుంబంలోని ముగ్గురు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. దీనితో అధికారులు అప్రమత్తమైయ్యారు. గతంలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులకు పాజిటివ్ అని తేలింది. తాజాగా మంత్రి ఇంట్లో కూడా లక్షణాలు బయటపడ్డాయి.
మంత్రి శంకర్ నారాయణ నివాసంలో ముగ్గురు కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే మంత్రికి పరీక్షలు చేయగా ఆయనకు నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అందరిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. మంత్రి గారి మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూనే శనివారం ఆమె చనిపోయారు. అయితే మంత్రి శంకర నారాయణ ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందని అందరూ భావించారు. తీరా పరీక్షలు చేయగా వైరస్ కారణంగా ఆమె మృతిచెందింది అని తేలింది
దీనితో అధికారులు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు వైరస్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రికి నెగిటివ్ వచ్చింది. అయితే మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మంత్రి కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకడంతో.. ఆయన నివసిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరంలోని సాయినగర్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాలనీ అంతా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.