Begin typing your search above and press return to search.

ఆ అసెంబ్లీ ద‌గ్గ‌ర ఎమ్మెల్యేలు..పోలీసుల త‌న్నులాట‌!

By:  Tupaki Desk   |   27 March 2018 5:04 AM GMT
ఆ అసెంబ్లీ ద‌గ్గ‌ర ఎమ్మెల్యేలు..పోలీసుల త‌న్నులాట‌!
X
అనుకుంటాం కానీ అధికార‌ప‌క్షం హ‌వా అంతా ఇంతా కాదు. చేతిలో ప‌వ‌ర్ ఉండాలే కానీ.. వైరిప‌క్షానికి ఏ స్థాయిలో చుక్క‌లు చూపించవ‌చ్చ‌న్న వైనాన్ని తాజాగా పుదుచ్చేరి అధికార‌ప‌క్షం చేత‌ల్లో చేసి చూపించింది. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల్ని.. చివ‌ర‌కు కోర్టు ఉత్త‌ర్వులు లైట్ తీసుకున్న వైనం సంచ‌ల‌నంగా మారింది. కేంద్రం నామినేట్ చేసిన స‌భ్యుల్ని ఎమ్మెల్యేలుగా ఒప్పుకునేంద‌కు నో అంటే నో అన్న వైనం ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది.

ఒక ద‌శ‌లో అసెంబ్లీ ద‌గ్గ‌ర మోడీ స‌ర్కారు నామినేట్ చేసిన స‌భ్యుల‌కు.. పుదుచ్చేరి అసెంబ్లీ ద‌గ్గ‌ర విధులు నిర్వ‌ర్తించే పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో తోపులాట వ‌ర‌కూ వెళ్లింది. బాహాబాహీకి దిగిన వైనం చూస్తే.. నోట వెంట మాట రాని ప‌రిస్థితి. అస‌లిలాంటి ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న‌ది చూస్తే..

పుదుచ్చేరి అసెంబ్లీకి కేంద్రం ముగ్గురు స‌భ్యుల్ని ఎంపిక చేసింది. ఈ ముగ్గురు బీజేపీకి చెందిన వారే. స్వామినాథ‌న్‌.. శంక‌ర్.. సెల్వ గ‌ణ‌ప‌తిల‌ను అసెంబ్లీకి నామానేట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. వీరిని స‌భ్యులుగా గుర్తించేందుకు కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి నో చెప్పేశారు. పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య‌మంత్రికి.. గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కిర‌ణ్ బేడీకి మ‌ధ్య ట‌ర్మ్స్ స‌రిగా లేవ‌న్న విష‌యం తెలిసిందే.

కేంద్రం నామినేట్ చేసిన స‌భ్యుల్ని గుర్తించేందుకు ముఖ్య‌మంత్రి నో చెప్ప‌టంతో..లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ సీన్లోకి వ‌చ్చేశారు. రాత్రికి రాత్రే రాజ్ భ‌వ‌న్లో ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం వారు మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు.

విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ముగ్గురు నియామ‌కాన్ని స‌మ‌ర్థించింది. న్యాయ‌పోరాటంలో గెలిచిన నామినేటెడ్ ఎమ్మెల్యేలు కోర్టు ఉత్త‌ర్వుల్ని ప‌ట్టుకొని పుదుచ్చేరి అసెంబ్లీ వ‌ద్ద‌కు వ‌చ్చారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాల్గొనే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి.. అక్క‌డి పోలీసులు నో అంటే నో అనేశారు. త‌మ‌కు కోర్టు ఉత్త‌ర్వుల కంటే కూడా స్పీక‌ర్ ఆదేశాల మేర‌కే న‌డుచుకుంటామ‌ని దీంతో.. కొత్త‌గా నామినేట్ అయిన స‌భ్యులు పుదుచ్చేరి అసెంబ్లీకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్యేల‌కు.. పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదంతో మొద‌లై.. ఇరు వ‌ర్గాల వారు తోపులాట‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. తామెంతో నిర‌స‌న వ్య‌క్తం చేసినా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమ‌తి నిరాక‌రించ‌టంతో ముఖ్య‌మంత్రి.. స్పీక‌ర్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఎంత అధికారం చేతిలో ఉంటే మాత్రం మ‌రీ ఇంత దారుణంగా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన పుదుచ్చేరి ప్ర‌భుత్వంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.