Begin typing your search above and press return to search.
ఉద్యోగులకు మూడు రోజులు వీక్లీ ఆఫ్ ... నాలుగు రోజులు మాత్రమే ఆఫీస్
By: Tupaki Desk | 1 Feb 2021 11:30 PM GMTజపాన్ .. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తి. జపాన్ ఆర్ధికంగా అభివృద్ధి సాధించడం వెనకు ఉద్యోగుల కృషి మరువలేనిది. సమయపాలన, కష్టించే పనిచేసే తత్వంతో ముందుసాగి జపాన్ కు ప్రపంచ పటంలో ప్రత్యేకతను తెచ్చిపెట్టారు. జపాన్ ఆర్ధికంగా అభివృద్ధి సాధించడం వెనకు ఉద్యోగుల కృషి మరువలేనిది. సమయపాలన, కష్టపడి పనిచేయడంలో జపాన్ పెట్టింది పేరు. అక్కడి ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పనిలో నిమగ్నమవుతుంటారు. ఉద్యోగుల్లోని అభద్రతా భావం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలి అనుకుంటుంది.
మూడు రోజులు సెలవులు ఉండటంతో అదనపు సంపాదనకు మరో అవకాశానికి వెసులుబాటు కలుగుతుంది. అయితే, సంస్థలు మాత్రం ఉద్యోగ భద్రత.. ఉద్యోగ ప్రయోజనాలు యథావిధిగా కొనసాగించేలా చూడాలని అంటున్నారు. ఈ బిల్లు తీసుకొస్తే ఉద్యోగులు వారంలో వారిని నచ్చినట్లుగా మూడు రోజులు సెలవులు తీసుకునే వీలు కల్పిస్తుందని నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల కోసం పనివేళలు.. కార్యాలయాల్లో పని వాతావారణం నచ్చిన విధంగా మార్చవచ్చని అంటున్నారు. ఉద్యోగుల కోసం పనివేళలను.. పని వాతావరణాన్ని నచ్చిన విధంగా మార్చగలమని నమ్ముతున్నారు నేతలు. జపాన్ లోని మైక్రోసాఫ్ట్.. తమ ఆఫీసులో ఉద్యోగులకు 2019 ఆగస్టు నెలలో మూడు రోజుల వారాంత సెలవులను ప్రయోగత్మకంగా అమలు చేసింది. ది వర్క్ లైఫ్ ఛాయిస్ ఛాలెంజ్ సమ్మర్-2019 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ జపాన్ అద్భుత విజయం సాధించింది.
ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో దీన్ని శాశ్వతంగా అమలు చేయాలని, చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జపాన్ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలని యోచించింది. అయితే ఇటీవల కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరగడంతో ఈ విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. మూడు రోజుల సెలవుల విధానం వల్ల కొవిడ్-19 సోకే ముప్పు తక్కువగా ఉంటుందని, ప్రజా రవాణా వినియోగం తగ్గుతుందని అంటున్నారు. అలాగే, తమ కుటుంబాలతో ఉద్యోగులు గడిపేందుకు సమయంతో పాటు ఇతర వృత్తులు చేసుకుంటూ అదనపు ఆదాయం పొందడం లేదా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది.