Begin typing your search above and press return to search.
కొత్త కార్లతో కేన్సర్ ముప్పు.. సంచలన విషయాలు వెలుగులోకి!
By: Tupaki Desk | 25 April 2023 9:29 AM GMTకొత్త కారు.. సగటు మధ్యతరగతి మానవుడి కల! ఇల్లు-కారు అనేది ఇప్పుడున్న సమాజంలో మధ్యతరగతి స్టేటస్ కూడా. అయితే.. కొత్త కార్లను కొన్న తర్వాత.. కారు విండోలను మూసేసి ప్రయాణం చేస్తే.. కారులోపల నుంచి వచ్చే వాసనలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణాలను కూడా వెల్లడిస్తున్నారు. కొత్త కార్ల తయారీ అంటేనే..అనే రసాయనాల సమ్మితంతో ఉన్న పదార్థాలను వినియోగిస్తారు. రంగులు.. ప్లాస్టిక్ వంటివి ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దుతారు.
వీటి కోసం వినియోగించే రసాయనాల ప్రభావం కనీసంలో కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కారును కొనుగోలు చేసిన తర్వాత.. విండోలను తెరిచి ఉంచి ప్రయాణించడాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
దీనికి కారణం.. ఏంటంటే.. కార్లు తయారు చేసే సమయంలో 'ఆఫ్ గ్యాసింగ్' అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. దీనివల్ల అనేక రకాల కెమికల్స్ విడుదలవుతాయి. ఇక ఈ కెమికల్స్ వాసన మనం కొనుగోలు చేసిన తర్వాత కూడా కొత్త కార్లలో వస్తూ ఉంటుంది.
అందుకే కొత్త కార్లలో ప్రయాణం చేసేవారు కార్ గ్లాసులు(విండోలు) మూసేసి ఆ వాసనను పీలుస్తూ ప్రయాణం చేస్తే.. ఆరోగ్య పరమైన ఇబ్బందులు వస్తాయని.. ముఖ్యంగా లంగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులు విండోలు కొంత వరకు తెరిచి(కిందకు దింపేసి) ప్రయాణం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
20 రకాల రసాయనాలు!
కారు లోపల వినియోగించే పదార్థాల్లో 20 రకాల కెమికల్స్ ఉంటాయని, అందులో క్యాన్సర్ కు కారణం అయ్యే ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త కార్లలో ఫార్మాల్డిహైడ్ శాతం మామూలుగా ఉండవలసిన దానికంటే, మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అది విషంతో సమానం అని చెబుతున్నారు. ఎక్కువ సేపు కొత్త కార్లను డ్రైవ్ చేసేవారిపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణం వేడిగా ఉంటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ సాధారణ పరిణామాలు..
తలనొప్పి రావడం, కడుపులో తిప్పడం, ఊపిరి సరిగా అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే పేర్కొన్నారు. ఇక క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొత్త కార్ల విషయంలో జాగ్రత్త అవసరం. వాటిల్లో ప్రయాణించే సమయంలో లోపల ఉన్న వాసన పూర్తిగా పోయేదాకా గ్లాసులు దించేసి ప్రయాణించాలని చెబుతున్నారు.